Back

హిందీలో సందేహాలు, ఊహలు (Presumptions): शायद ... होगा

మనం తెలుగులో "బహుశా వాళ్ళు ఆ పని చేస్తుంటారు", "బహుశా వస్తుంటారు" అని ఊహించి చెబుతుంటాం కదా! హిందీలో ఇలా చెప్పడానికి शायद (షాయద్ - బహుశా) అనే పదాన్ని వాడి, వాక్యం చివర होगा/होगी/होंगे వాడతాము.

ముందుగా బేసిక్స్ చూద్దాం (To Be Forms in Future/Doubt):

  • हूँगा / हूँगी (హూంగా/హూంగీ) = ఉంటాను
  • होगे / होगी (హోగే/హోగీ) = ఉంటావు
  • होगा / होगी (హోగా/హోగీ) = ఉంటాడు / ఉంటుంది
  • होंगे / होंगी (హోంగే/హోంగీ) = ఉంటారు / ఉంటాము / ఉంటాయి

1. ప్రతిరోజూ చేసే పనులను ఊహించడం (Habitual Presumptions):

వీటికి క్రియ చివర ते होंगे / ता होगा వస్తుంది.

शायद वे हर दिन प्रैक्टिस करते होंगे।

Shayad ve har din practice karte honge.

Telugu: బహుశా వాళ్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటారు.

English: Maybe they practice every day.

शायद तुम मानते होगे। / शायद वे हर दिन 9 बजे बंद करते होंगे।

Shayad tum maante hoge. / Shayad ve har din 9 baje band karte honge.

Telugu: బహుశా నువ్వు నమ్ముతుంటావు. / బహుశా వాళ్లు ప్రతిరోజు 9 గంటలకి మూస్తుంటారు.

English: Maybe you believe it. / Maybe they close at 9 o'clock every day.

2. జరుగుతున్న పనిని ఊహించడం (Continuous Presumptions):

వీటికి క్రియ చివర रहे होंगे / रहा होगा వస్తుంది.

शायद वे अभी प्रैक्टिस कर रहे होंगे। / शायद तुम मान रहे होगे।

Shayad ve abhi practice kar rahe honge. / Shayad tum maan rahe hoge.

Telugu: బహుశా వాళ్లు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. / బహుశా నువ్వు నమ్ముతూ ఉంటావు.

English: Maybe they are practicing now. / Maybe you are believing it.

शायद तुम खर्राटे मार रहे होगे। / शायद वे अभी बंद कर रहे होंगे।

Shayad tum kharraate maar rahe hoge. / Shayad ve abhi band kar rahe honge.

Telugu: బహుశా నువ్వు గురక పెడుతూ ఉంటావు. / బహుశా వాళ్ళు ఇప్పుడు మూస్తూ ఉంటారు.

English: Maybe you are snoring. / Maybe they are closing it now.

3. జరిగిపోయిన పనిని ఊహించడం (Completed Presumptions):

ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి, సకర్మక క్రియల (Transitive Verbs) ముందు 'ने' వస్తుంది.

शायद उन्होंने अभ्यास किया होगा।

Shayad unhone abhyaas kiya hoga.

Telugu: బహుశా వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. (अभ्यास అనేది సకర్మక క్రియ, కాబట్టి उन्होंने వాడాలి)

English: Maybe they have practiced.

शायद तुमने खर्राटे मारे होंगे। / शायद तुमने माना होगा।

Shayad tumne kharraate maare honge. / Shayad tumne maana hoga.

Telugu: బహుశా నువ్వు గురకబెట్టి ఉంటావు. / బహుశా నువ్వు నమ్మి ఉంటావు. (तुमने వాడాలి)

English: Maybe you had snored. / Maybe you had believed.

शायद उन्होंने बंद किया होगा।

Shayad unhone band kiya hoga.

Telugu: బహుశా వాళ్ళు మూసేసి ఉంటారు.

English: Maybe they have closed it.

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!