"के अलावा" (Ke Alawa) - కాకుండా / తప్ప ని ఎలా వాడాలి?
హిందీలో के अलावा (కే అల్లావా) అంటే "చేయడమే కాకుండా" (In addition to / Besides) లేదా "చేయడం తప్ప" (Except). ఇది ఒక వాక్యంలో ఇంకొక విషయాన్ని జోడించడానికి లేదా మినహాయించడానికి వాడతాము.
Rule: Verbs (క్రియలు) తో పాటు వాడటం
ఏదైనా "ఒక పని చేయడమే కాకుండా ఇంకో పని కూడా చేస్తాను" అని చెప్పడానికి, క్రియ చివర ఉన్న 'ना' ని 'ने' గా మార్చి దానికి 'के अलावा' కలపాలి.
Formula: Verb(ने) + के अलावा
पढ़ाना (బోధించడం) -> पढ़ाने के अलावा (బోధించడమే కాకుండా)
रखना (ఉంచడం) -> रखने के अलावा (ఉంచడమే కాకుండా)
सुखाना (ఆరబెట్టడం) -> सुखाने के अलावा (ఆరబెట్టడమే కాకుండా)
समझना (అర్థం చేసుకోవడం) -> समझने के अलावा (అర్థం చేసుకోవడమే కాకుండా)
शुरू करना (మొదలుపెట్టడం) -> शुरू करने के अलावा (మొదలు పెట్టడమే కాకుండా)
खाना पकाना (వంట చేయడం) -> खाना पकाने के अलावा (వంట చేయడమే కాకుండా)
बदलना (మార్చడం) -> बदलने के अलावा (మార్చడమే కాకుండా)
గమనిక: ఈ రూల్ ని వాక్యాలలో ఎలా వాడాలో క్రింద చూడండి
आप हिंदी पढ़ाने के अलावा इंग्लिश भी पढ़ाइए।
తెలుగు: మీరు హిందీ బోధించడమే కాకుండా ఇంగ్లీష్ కూడా బోధించండి.
English: Besides teaching Hindi, please teach English also.
उन्हें ऐसा अंदर रखने के अलावा कभी-कभी पढ़ो।
తెలుగు: వాటిని అలా లోపల పెట్టడం కాకుండా అప్పుడప్పుడు చదువు.
English: Besides keeping them inside like that, read them sometimes.
कपड़े सुखाने के अलावा इस्त्री भी करो।
తెలుగు: బట్టలు ఆరబెట్టడమే కాకుండా ఇస్త్రీ కూడా చెయ్యు.
English: Besides drying the clothes, iron them too.
समझने के अलावा बार-बार पढ़ो।
తెలుగు: అర్థం చేసుకోవడమే కాకుండా మళ్లీమళ్లీ చదువు.
English: Besides understanding, read it again and again.
शुरू करने के अलावा पूरा भी करो।
తెలుగు: మొదలుపెట్టడమే కాకుండా పూర్తి కూడా చెయ్యి.
English: Besides starting it, complete it as well.
खाना पकाने के अलावा हमें परोसो।
తెలుగు: వంట చేయడమే కాకుండా మాకు వడ్డించు.
English: Besides cooking the food, serve us.
देखने के अलावा पकाओ।
తెలుగు: చూడడమే కాకుండా వండు.
English: Besides looking, cook it.
देखने के अलावा मत पकाओ।
తెలుగు: చూడడం తప్ప వండకు. (అంటే చూడటం మాత్రమే చెయ్యి)
English: Don't do anything except looking (Don't cook).
तुम घर किराए पर लेने के अलावा मत खरीदो।
తెలుగు: నువ్వు ఇల్లు అద్దెకు తీసుకో తప్ప కొనొద్దు.
English: Except renting the house, don't buy it.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)