Back

హిందీలో దినచర్య (Daily Routine) - మాస్టర్ లిస్ట్ Part 1

మనం రోజూ చేసే పనులను (Habits) హిందీలో చెప్పడానికి "Simple Present Tense" ఉపయోగిస్తాం. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుండి మధ్యాహ్నం వరకు మనం చేసే పనులను పక్కా వాడుక భాషలో ఎలా చెప్పాలో ఈ 30 వాక్యాల మాస్టర్ లిస్ట్ ద్వారా నేర్చుకుందాం. (పురుషులు 'ता हूँ' అని, స్త్రీలు 'ती हूँ' అని వాడాలి).

ఉదయం పనులు (Morning Routine):

1. मैं रोज़ सुबह साढ़े पाँच बजे उठता हूँ / उठती हूँ।

Telugu: నేను ప్రతిరోజు ఐదున్నరకు లేస్తాను.

English: I wake up at 5:30 AM daily.

2. मैं मोबाइल चार्ज पर लगाता हूँ / लगाती हूँ।

Telugu: నేను మొబైల్ కి చార్జింగ్ పెడతాను.

English: I put the mobile on charge.

3. चार्जिंग फुल होते ही मैं मोबाइल चार्जिंग से निकाल देता हूँ / देती हूँ।

Telugu: చార్జింగ్ ఫుల్ అవ్వగానే మొబైల్ చార్జింగ్ తీసేస్తాను.

English: Once fully charged, I take the mobile off charge.

4. मैं ब्रश करता हूँ / करती हूँ।

Telugu: నేను బ్రష్ చేస్తాను.

English: I brush my teeth.

5. मैं चेहरा धोता हूँ / धोती हूँ।

Telugu: నేను ఫేస్ వాష్ చేసుకుంటాను.

English: I wash my face.

6. मैं जूते पहनता हूँ / पहनती हूँ।

Telugu: నేను షూస్ వేసుకుంటాను.

English: I wear shoes.

7. मैं पैदल ग्राउंड जाता हूँ / जाती हूँ।

Telugu: నేను నడుచుకొని గ్రౌండ్ కి వెళ్తాను.

English: I go to the ground on foot.

8. मैं ग्राउंड में अपने दोस्त से मिलता हूँ / मिलती हूँ।

Telugu: నేను గ్రౌండ్ లో మా ఫ్రెండ్ ని కలుస్తాను.

English: I meet my friend at the ground.

9. हम दोनों पहले वॉकिंग करते हैं।

Telugu: మా ఇద్దరం ఫస్ట్ వాకింగ్ చేస్తాము.

English: First, both of us do walking.

10. उसके बाद हम दौड़ते हैं।

Telugu: తర్వాత మేము పరిగెడతాము.

English: After that, we run.

11. उसके बाद हम एक्सरसाइज़ करते हैं।

Telugu: తర్వాత మేము ఎక్సర్‌సైజ్ చేస్తాము.

English: After that, we exercise.

12. उसके बाद मैं स्किपिंग करता हूँ / करती हूँ।

Telugu: తర్వాత నేను స్కిప్పింగ్ చేస్తాను.

English: After that, I do skipping.

13. उसके बाद मैं अंबाली (रागी का पेय) पीता हूँ / पीती हूँ।

Telugu: తర్వాత నేను అంబలి తాగుతాను.

English: After that, I drink Ambali.

14. फिर मैं पैदल घर वापस चला जाता हूँ / चली जाती हूँ।

Telugu: మళ్ళీ నేను ఇంటికి నడుచుకొని వెళ్ళిపోతాను.

English: Then I walk back home.

15. घर पहुँचने के बाद मैं नहाता हूँ / नहाती हूँ।

Telugu: ఇంటికి వెళ్ళిన తర్వాత నేను స్నానం చేస్తాను.

English: After reaching home, I take a bath.

16. मैं कपड़े पहनता हूँ / पहनती हूँ।

Telugu: నేను బట్టలు వేసుకుంటాను.

English: I wear clothes.

17. मैं नाश्ता करता हूँ / करती हूँ।

Telugu: నేను టిఫిన్ తింటాను.

English: I eat breakfast.

18. समय मिलने पर मैं हिंदी प्रैक्टिस करता हूँ / करती हूँ।

Telugu: టైమ్ ఉంటే నేను హిందీ ప్రాక్టీస్ చేస్తాను.

English: If I get time, I practice Hindi.

19. या मैं क्लास अटेंड करता हूँ / करती हूँ।

Telugu: లేదా నేను క్లాస్ కి అటెండ్ అవుతాను.

English: Or I attend the class.

20. क्लास में हिंदी सुनता हूँ / सुनती हूँ।

Telugu: క్లాస్ లో హిందీ వింటాను.

English: I listen to Hindi in the class.

మధ్యాహ్నం పనులు (Afternoon Routine):

21. मैं लिखता हूँ / लिखती हूँ।

Telugu: నేను (క్లాస్ నోట్స్) రాసుకుంటాను.

English: I write.

22. मैं प्रैक्टिस करता हूँ / करती हूँ।

Telugu: నేను ప్రాక్టీస్ చేస్తాను.

English: I practice.

23. बाद में अगर कोई काम हो तो मैं बाहर जाता हूँ / जाती हूँ।

Telugu: తర్వాత ఏమైనా వర్క్ ఉంటే నేను బయటకి వెళ్తాను.

English: Later, if there is any work, I go out.

24. बाइक पर कभी-कभी मैं मंदिर जाता हूँ / जाती हूँ।

Telugu: బైక్ మీద అప్పుడప్పుడు నేను టెంపుల్స్ కి వెళ్తాను.

English: Sometimes I go to temples on a bike.

25. दोपहर का समय होते ही मैं लंच करता हूँ / करती हूँ।

Telugu: మధ్యాహ్నం అవ్వగానే నేను లంచ్ తింటాను.

English: As soon as it's afternoon, I have lunch.

26. मैं इंस्टाग्राम देखता हूँ / देखती हूँ।

Telugu: నేను ఇన్‌స్టాగ్రామ్ చూస్తాను.

English: I watch Instagram.

27. मैं यूट्यूब देखता हूँ / देखती हूँ।

Telugu: నేను యూట్యూబ్ చూస్తాను.

English: I watch YouTube.

28. मैं दोस्तों से फोन पर बात करता हूँ / करती हूँ।

Telugu: నేను ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతాను.

English: I talk to my friends on the phone.

29. मैं थोड़ी देर सोता हूँ / सोती हूँ।

Telugu: నేను కొంచెం సేపు పడుకుంటాను.

English: I sleep for a while.

30. मैं सपने देखता हूँ / देखती हूँ।

Telugu: నేను కలలు కంటాను.

English: I dream.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!