హిందీలో 'लगना' మరియు 'लगाना' పదాల ఉపయోగాలు
హిందీలో ఏదైనా "అనిపిస్తుంది", సమయం "పడుతుంది", దెబ్బ "తగిలింది" లేదా బంధుత్వాలు చెప్పడానికి 'लगना (Lagna)' ని వాడతాము. అలాగే ఏదైనా పూయడం/పెట్టడం (అప్లై చేయడం) చెప్పడానికి 'लगाना (Lagaana)' వాడతాము. వాటి ఉదాహరణలు చూద్దాం.
मुझे भूख लग रही है। / मुझे प्यास लग रही है।
Telugu: నాకు ఆకలి అనిపిస్తుంది (వేస్తోంది) / నాకు దాహం అనిపిస్తుంది.
English: I am feeling hungry. / I am feeling thirsty.
यहाँ बहुत गर्मी लग रही है / ठंड लग रही है।
Telugu: ఇక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది / చాలా చల్లగా అనిపిస్తుంది.
English: It feels very hot / cold here.
यह तुम्हें कैसा लग रहा है?
Telugu: ఇది నీకు ఎలా అనిపిస్తుంది?
English: How is this feeling to you? / How do you feel about this?
मुझे लगता है कि आज बारिश होगी।
Telugu: ఈరోజు వర్షం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది.
English: I think that it will rain today.
बाइक रिपेयर करने में कितना समय लगेगा?
Telugu: బైక్ రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది?
English: How much time will it take to repair the bike?
डॉक्टर की पढ़ाई के लिए कितने पैसे लगेंगे?
Telugu: డాక్టర్ చదవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుద్ది (పడుతుంది)?
English: How much money will it cost to study medicine?
वह आपकी क्या लगती है? / वह आपका क्या लगता है?
Telugu: ఆమె మీకు ఏమవుతుంది? / అతను మీకు ఏమవుతాడు?
English: How is she related to you? / How is he related to you?
घर में दीमक लग गई है। / बालों में जूं पड़ गई हैं।
Telugu: ఇంట్లో చెదలు పట్టేసాయి. / తలలో పేలు పట్టేసాయి.
English: Termites have infested the house. / Lice have infested the hair.
मुझे लॉटरी लगी। / मेरी नौकरी लग गई।
Telugu: నాకు లాటరీ తగిలింది. / నాకు ఉద్యోగం వచ్చింది.
English: I won a lottery. / I got a job.
खाना मेज़ पर लग गया है, जाकर खाइए।
Telugu: భోజనం టేబుల్ మీద పెట్టబడింది, వెళ్లి తినండి.
English: The food is served on the table, go and eat.
चेहरे पर क्रीम लगा लो। / बालों में तेल लगा लो।
Telugu: ముఖానికి క్రీమ్ రాసుకో. / జుట్టుకు ఆయిల్ (నూనె) పెట్టుకో.
English: Apply cream on the face. / Apply oil to the hair.
इन्हें वहां लगा दो। / पोस्टर दीवार पर लगाइए।
Telugu: వీటిని అక్కడ తగిలించు. / పోస్టర్ గోడ మీద అంటించండి.
English: Attach them there. / Put the poster on the wall.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)