హిందీ గత కాలంలో 'ने' (నే) నియమం (The 'Ne' Rule)
హిందీలో పాస్ట్ టెన్స్ (Past Tense) నేర్చుకునేటప్పుడు అందరికీ కన్ఫ్యూజ్ చేసేది 'ने' రూల్. ఇది చాలా సింపుల్! ఒక క్రియకు కర్మ (Object - అనగా దేనిని? ఎవరిని? అనే ప్రశ్నకు జవాబు) ఉంటే, గతకాలంలో కర్త (Subject) పక్కన కచ్చితంగా 'ने' వస్తుంది.
ముఖ్యమైన నియమం (Golden Rule):
వాక్యంలో 'ने' వచ్చినప్పుడు, క్రియ (Verb) అనేది మనం మాట్లాడే వస్తువు (Object) యొక్క జెండర్ ని బట్టి మారుతుంది కానీ, మాట్లాడే వ్యక్తి (Subject) ని బట్టి మారదు.
1. खाना (భోజనం - Masculine Singular):
భోజనం పుంలింగం ఏకవచనం కాబట్టి, సబ్జెక్ట్ ఎవరైనా సరే క్రియ 'खाया' (ఖాయా) అనే వస్తుంది.
- मैंने खाना खाया। — నేను భోజనం తిన్నాను.
- तुमने खाना खाया। — నువ్వు భోంచేసావు.
- उसने खाना खाया। — అతను / ఆమె భోజనం తిన్నాడు/తిన్నది.
- हमने खाना खाया। — మేము భోజనం తిన్నాము.
- आपने खाना खाया। — తమరు (మీరు) భోజనం తిన్నారు.
- उन्होंने खाना खाया। — వాళ్ళు భోజనం తిన్నారు.
2. फिल्म (సినిమా - Feminine Singular):
సినిమా స్త్రీలింగం కాబట్టి, సబ్జెక్ట్ ఎవరైనా సరే క్రియ 'देखी' (దేఖీ) అని వస్తుంది.
- मैंने फिल्म देखी। — నేను సినిమా చూశాను.
- तुमने फिल्म देखी। — నువ్వు సినిమా చూసావు.
- उसने फिल्म देखी। — అతడు / ఆమె సినిమా చూసాడు/చూసింది.
- हमने फिल्म देखी। — మేము సినిమా చూసాము.
- आपने फिल्म देखी। — తమరు (మీరు) సినిమా చూశారు.
- उन्होंने फिल्म देखी। — వాళ్లు సినిమా చూశారు.
3. फल (పండ్లు - Masculine Plural):
పండ్లు బహువచనం కాబట్టి, క్రియ 'खाए' (ఖాయే) అని వస్తుంది.
- मैंने फल खाए। — నేను పళ్ళు తిన్నాను.
- तुमने फल खाए। — నువ్వు పళ్ళు తిన్నావు.
- उसने फल खाए। — అతను / ఆమె పళ్ళు తిన్నాడు/తిన్నది.
- हमने फल खाए। — మేము పళ్ళు తిన్నాము.
- आपने फल खाए। — తమరు (మీరు) పళ్ళు తిన్నారు.
- उन्होंने फल खाए। — వాళ్లు పళ్ళు తిన్నారు.
4. रोटियां (రోటీలు - Feminine Plural):
రోటీలు స్త్రీలింగ బహువచనం కాబట్టి, క్రియ 'खाईं' (ఖాయీం) అని వస్తుంది.
- मैंने रोटियां खाईं। — నేను రోటీలు తిన్నాను.
- तुमने रोटियां खाईं। — నువ్వు రోటీలు తిన్నావు.
- उसने रोटियां खाईं। — అతను / ఆమె రోటీలు తిన్నాడు/తిన్నది.
- हमने रोटियां खाईं। — మేము రోటీలు తిన్నాము.
- आपने रोटियां खाईं। — తమరు (మీరు) రోటీలు తిన్నారు.
- उन्होंने रोटियां खाईं। — వాళ్ళు రోటీలు తిన్నారు.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)