Back

హిందీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? Grammar చూసి భయపడుతున్నారా? అసలు భయపడకండి! మన తెలుగుకి, హిందీకి చాలా పోలికలు ఉన్నాయి. ఈ పోస్ట్‌లో తెలుగు, English మరియు Hindi వాక్యాలను పోలుస్తూ Tenses (కాలాలు) ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో చూద్దాం! 🚀

1️⃣ దినచర్యలు / అలవాట్లు (Habitual Actions - Simple Tenses)

ప్రతిరోజూ చేసే పనులు, గతంలో అలవాటుగా చేసిన పనులు మరియు భవిష్యత్తులో జరిగే పనులను ఎలా చెప్పాలో చూద్దాం. (హిందీలో చివరన "తా / తీ / తే" వస్తాయి).

🥦 Vegetables (కూరగాయలు తీసుకురావడం)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
मैं हर दिन बाजार से सब्जियां लाती हूँ।
Main har din bazaar se sabziyan laati hoon.
నేను ప్రతిరోజు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తాను.
I bring vegetables from the market every day.
मैं हर दिन बाजार से सब्जियां लाती थी।
Main har din bazaar se sabziyan laati thi.
నేను ప్రతిరోజు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చేదానిని.
I used to bring vegetables from the market every day.
शायद वे हर दिन बाजार से सब्जियां लाते होंगे।
Shayad ve har din bazaar se sabziyan laate honge.
బహుశా వాళ్ళు ప్రతిరోజూ మార్కెట్ నుంచి కూరగాయలు తెస్తుంటారు.
Maybe they bring vegetables from the market every day.
वे कल बाजार से सब्जियां लायेंगे।
Ve kal bazaar se sabziyan laayenge.
రేపు వాళ్ళు మార్కెట్ నుండి కూరగాయలు తెస్తారు.
They will bring vegetables from the market tomorrow.

📍 Living (నివసించడం)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
वे विशाखापत्तनम में रहते हैं।
Ve Visakhapatnam mein rehte hain.
వాళ్లు విశాఖపట్నం లో ఉంటారు.
They live in Visakhapatnam.
वे विशाखापत्तनम में रहते थे।
Ve Visakhapatnam mein rehte the.
వాళ్లు విశాఖపట్నం లో ఉండేవారు.
They used to live in Visakhapatnam.
शायद वे विशाखापत्तनम में रहते होंगे।
Shayad ve Visakhapatnam mein rehte honge.
బహుశా వాళ్ళు విశాఖపట్నం లో ఉంటుంటారు.
Maybe they live in Visakhapatnam.
हम कल विशाखापत्तनम में रहेंगे।
Hum kal Visakhapatnam mein rahenge.
మేము రేపు విశాఖపట్నం లో ఉంటాము.
We will be in Visakhapatnam tomorrow.

🪔 Festivals (పండుగలు)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
हम दिवाली मनाते हैं।
Hum Diwali manaate hain.
మేము దీపావళి జరుపుకుంటాము.
We celebrate Diwali.
हम दिवाली मनाते थे।
Hum Diwali manaate the.
మేము దీపావళి జరుపుకునే వాళ్ళం.
We used to celebrate Diwali.
शायद वे दिवाली मनाते होंगे।
Shayad ve Diwali manaate honge.
బహుశా వాళ్లు దీపావళి జరుపుకుంతుంటారు.
Maybe they celebrate Diwali.
हम अगले साल दिवाली मनाएंगे।
Hum agle saal Diwali manayenge.
మేము వచ్చేసంవత్సరం దీపావలి జరుపుకుంటాము.
We will celebrate Diwali next year.

🥻 Shopping (కొనుగోలు)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
वह साड़ियां खरीदती है।
Vah saadiyan khareedti hai.
ఆమె చీరలు కొంటుంది.
She buys sarees.
वह साड़ियां खरीदती थी।
Vah saadiyan khareedti thi.
ఆమె ఇంతకుముందు చీరలు కొనేది.
She used to buy sarees.
शायद वह साड़ियाँ खरीदती होगी।
Shayad vah saadiyan khareedti hogi.
బహుశా ఆమె చీరలు కొంటుంతుంది.
Maybe she buys sarees.
वह कल साड़ियाँ खरीदेगी।
Vah kal saadiyan khareedegi.
ఆమె రేపు చీరలు కొంటుంది.
She will buy sarees tomorrow.

2️⃣ కొనసాగుతున్న పనులు (Continuous Actions)

ప్రస్తుతం జరుగుతున్న, గతంలో జరుగుతూ ఉండిన పనులను ఎలా చెప్పాలో చూద్దాం. (హిందీలో చివరన "రహా / రహీ / రహే" వస్తాయి. ఇంగ్లీషులో "ing" ఫామ్ అన్నమాట!).

🏏 Cricket (ఆట)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
वह क्रिकेट खेल रहा है।
Vah cricket khel raha hai.
అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.
He is playing cricket.
वह कल क्रिकेट खेल रहा था।
Vah kal cricket khel raha tha.
అతడు నిన్న క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.
He was playing cricket yesterday.
वह शायद अभी क्रिकेट खेल रहा होगा।
Vah shayad abhi cricket khel raha hoga.
అతను బహుశా ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు.
He might be playing cricket now.
वह कल क्रिकेट खेल रहा होगा।
Vah kal cricket khel raha hoga.
అతను రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాడు.
He will be playing cricket tomorrow.
वह कल क्रिकेट खेलेगा।
Vah kal cricket khelega.
అతడు రేపు క్రికెట్ ఆడుతాడు.
He will play cricket tomorrow.

👗 Washing Clothes (బట్టలు ఉతకడం)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
वह कपड़े धो रही है।
Vah kapde dho rahi hai.
ఆమె బట్టలు ఉతుకుతూ ఉంది.
She is washing clothes.
वह कल इस समय में कपड़े धो रही थी।
Vah kal is samay mein kapde dho rahi thi.
ఆమె నిన్న ఈ సమయానికి బట్టలు ఉతుకుతూ ఉంది.
She was washing clothes at this time yesterday.
वह कल इस समय में कपड़े धो रही होगी।
Vah kal is samay mein kapde dho rahi hogi.
ఆమె రేపు ఈ సమయానికి బట్టలు ఉతుకుతూ ఉంటుంది.
She will be washing clothes at this time tomorrow.
शायद वह अभी कपड़े धो रही होगी।
Shayad vah abhi kapde dho rahi hogi.
బహుశా ఆమె ఇప్పుడు బట్టలు ఉతుకుతూ ఉంటుంది.
Maybe she is washing clothes right now.
वह कल कपडे धोएगी।
Vah kal kapde dho-egi.
ఆమె రేపు బట్టలు ఉతుకుతుంది.
She will wash clothes tomorrow.

🔪 Cutting Veggies (కూరగాయలు కోయడం)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
वे सब्जियां काट रहे हैं।
Ve sabziyan kaat rahe hain.
వాళ్లు కూరగాయలు కోస్తూ ఉన్నారు.
They are cutting vegetables.
वे कल इस समय में सब्जियां काट रहे थे।
Ve kal is samay mein sabziyan kaat rahe the.
వాళ్లు నిన్న ఈ సమయానికి కూరగాయలు కోస్తూ ఉన్నారు.
They were cutting vegetables at this time yesterday.
वे कल इस समय में सब्जियां काट रहे होंगे।
Ve kal is samay mein sabziyan kaat rahe honge.
వాళ్లు రేపు ఈ సమయానికి కూరగాయలు కోస్తూ ఉంటారు.
They will be cutting vegetables at this time tomorrow.
शायद वे अभी सब्जियां काट रहे होंगे।
Shayad ve abhi sabziyan kaat rahe honge.
బహుశా వాళ్ళు ఇప్పుడు కూరగాయలు కోస్తూ ఉంటారు.
Maybe they are cutting vegetables right now.
कल वे सब्जियाँ काटेंगे।
Kal ve sabziyan kaatenge.
రేపు వాళ్ళు కూరగాయలు కోస్తారు.
They will cut vegetables tomorrow.

3️⃣ All Tenses in a Single Glance (ఒకే పని - అన్ని కాలాలు)

ఇప్పుడు వంట చేయడం (Cooking) అనే ఒకే పదాన్ని అన్ని కాలాల్లో ఎలా మారుతుందో చూద్దాం. ఇది చూస్తే మీకు పూర్తి Clarity వస్తుంది! 👩‍🍳

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
वह हर दिन खाना पकाती है।
Vah har din khaana pakaati hai.
ఆమె ప్రతిరోజు వంట చేస్తుంది.
She cooks everyday.
वह इसके पहले खाना पकाती थी।
Vah iske pehle khaana pakaati thi.
ఆమె ఇంతకుముందు వంట చేసేది.
She used to cook before.
शायद वह हर दिन खाना पकाती होगी।
Shayad vah har din khaana pakaati hogi.
బహుశా ఆమె ప్రతిరోజు వంట చేస్తుంటుంది.
Maybe she cooks everyday.
वह कल खाना पकायेगी।
Vah kal khaana pakaayegi.
ఆమె రేపు వంట చేస్తుంది.
She will cook tomorrow.
वह अभी खाना पका रही है।
Vah abhi khaana paka rahi hai.
ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉంది.
She is cooking now.
वह कल इस समय में खाना पका रही थी।
Vah kal is samay mein khaana paka rahi thi.
ఆమె నిన్న ఈ సమయానికి వంట చేస్తూ ఉంది.
She was cooking at this time yesterday.
वह कल इस समय में खाना पका रही होगी।
Vah kal is samay mein khaana paka rahi hogi.
ఆమె రేపు ఈ సమయానికి వంట చేస్తూ ఉంటుంది.
She will be cooking at this time tomorrow.
शायद वह अभी खाना पका रही होगी।
Shayad vah abhi khaana paka rahi hogi.
బహుశా ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉంటుంది.
Maybe she is cooking right now.

4️⃣ పూర్తయిన పనులు (Perfect Tenses - Completed Actions)

ఒక పని పూర్తయింది అని చెప్పడానికి హిందీలో "నే (ने)" అనే పదాన్ని వాడతారు. (ఇది చాలా ముఖ్యం!)

❓ Asking a Question (ప్రశ్న అడగటం)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
तुमने सवाल पूछा।
Tumne sawaal poocha.
నువ్వు ప్రశ్న అడిగావు.
You asked a question.
तुमने सवाल पूछा है।
Tumne sawaal poocha hai.
నువ్వు ప్రశ్న అడిగి ఉన్నావు.
You have asked a question.
तुमने सवाल पूछा था।
Tumne sawaal poocha tha.
నువ్వు ప్రశ్న అడిగి ఉండినావు.
You had asked a question.
तुमने सवाल पूछा होगा।
Tumne sawaal poocha hoga.
బహుశా నువ్వు ప్రశ్న అడిగి ఉంటావు.
You might have asked a question.
💡 Tip: హిందీలో గతం (Past tense) లో పని జరిగినప్పుడు, Subject కి 'ने' (ne) చేరుతుంది. (నువ్వు - తుమ్ (Tum) + నే (ne) = తుమ్నే (Tumne)).

సారాంశం (Summary):

అలవాట్లు (Habitual): తా / తీ / తే (ता / ती / ते)

జరుగుతున్నవి (Continuous): రహా / రహీ / రహే (रहा / रही / रहे)

భవిష్యత్తు (Future): గా / గీ / గే (गा / गी / गे)

గతం (Past): థా / థీ / థే (था / थी / थे)

ఈ పోస్ట్ ని Save/Bookmark చేసుకోండి. రోజూ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే హిందీ చాలా ఈజీగా మాట్లాడేయొచ్చు! 👍

Share & Earn Wallet Points!

Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!

మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
WhatsApp Facebook

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?