హిందీ కథలు: సింహం మరియు ఎలుక (शेर और चूहा)
ఈ పోస్ట్‌లో "సింహం మరియు ఎలుక" కథ ద్వారా హిందీలో వాక్యాలు ఎలా నిర్మిస్తారో తెలుసుకుందాం. కథలు చదవడం వల్ల పదజాలం (Vocabulary) వేగంగా పెరుగుతుంది. వాయిస్ వినడానికి స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
एक जंगल में एक शेर पेड़ के नीचे सो रहा था।
Telugu: ఒక అడవిలో ఒక సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉండింది.
English: A lion was sleeping under a tree in a jungle.
तभी एक छोटा चूहा वहां आकर शेर पर चढ़कर खेलने लगा।
Telugu: అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి సింహం మీద ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది.
English: Just then a small mouse came there, climbed on the lion, and started playing.
शेर की नींद टूट गई और उसने गुस्से से चूहे को पकड़ लिया।
Telugu: సింహానికి మెలకువ వచ్చి కోపంతో ఎలుకను పట్టుకుంది.
English: The lion woke up and caught the mouse angrily.
चूहे ने डरकर विनती की, "कृपया मुझे छोड़ दीजिए, किसी दिन मैं आपकी मदद जरूर करूंगा।"
Telugu: ఎలుక భయపడి "దయచేసి నన్ను వదిలేయండి, ఏదో ఒక రోజు నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను" అని బ్రతిమిలాడింది.
English: The mouse pleaded in fear, "Please leave me, someday I will surely help you."
चूहे की बातों पर शेर ने हंसकर उसे छोड़ दिया।
Telugu: ఎలుక మాటలకు సింహం నవ్వి దాన్ని వదిలేసింది.
English: Laughing at the mouse's words, the lion let it go.
कुछ दिनों के बाद वह शेर एक शिकारी के जाल में फंस गया।
Telugu: కొన్ని రోజుల తర్వాత ఆ సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.
English: A few days later, that lion got caught in a hunter's net.
वह जाल से बाहर नहीं निकल पा रहा था और ज़ोर से दहाड़ रहा था।
Telugu: అది వల నుంచి బయటకు రాలేక పోయింది, మరియు చాలా గట్టిగా గర్జిస్తోంది. (जाल - Jaal అంటే వల, जल అంటే నీరు)
English: He was unable to get out of the net and was roaring loudly.
वह आवाज सुनकर चूहा वहां आया।
Telugu: ఆ శబ్దం విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది.
English: Hearing that voice, the mouse came there.
उसने अपने तेज़ दांतों से जाल को काटकर शेर को बचाया।
Telugu: అది తన పదునైన పళ్ళతో వలను కొరికి సింహాన్ని కాపాడింది.
English: It saved the lion by biting the net with its sharp teeth.
शेर ने चूहे को बहुत प्यार से धन्यवाद दिया।
Telugu: సింహం ఎలుకకు ప్రేమగా కృతజ్ఞతలు చెప్పింది.
English: The lion lovingly thanked the mouse.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)