హిందీలో 'తినడం' (खाना) అనే క్రియతో 400 వాక్యాలు
హిందీ నేర్చుకోవడంలో క్రియల (Verbs) పాత్ర చాలా ముఖ్యం. ఒక్క క్రియను తీసుకుని దాన్ని అన్ని కాలాల్లో (Tenses), రకరకాల సందర్భాల్లో ఎలా వాడాలో తెలిస్తే మీరు ఏ క్రియతోనైనా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఈ బ్లాగ్‌లో మనం 'తినడం' (खाना) అనే క్రియను తీసుకుని దాన్ని 400 రకాలుగా ఎలా వాడాలో ఉదాహరణలతో (Telugu మరియు English లో) నేర్చుకుందాం.
1. खाओ।
Telugu: తిను.
English: Eat.
2. मत खाओ।
Telugu: తినొద్దు.
English: Don't eat.
3. ना खाओ।
Telugu: తినకు.
English: Don't eat (casual).
4. आप खाइए।
Telugu: తినండి (గౌరవంగా).
English: Please eat.
5. आप मत खाइए।
Telugu: తినొద్దండి.
English: Please don't eat.
6. आप ना खाइए।
Telugu: తినకండి.
English: Please don't eat.
7. खाने दो।
Telugu: తిననివ్వు.
English: Let (someone) eat.
8. मत खाने दो।
Telugu: తిననివ్వద్దు.
English: Don't let (someone) eat.
9. खाने दीजिए।
Telugu: తిననివ్వండి.
English: Please let (someone) eat.
10. एक बार खा कर देखो।
Telugu: ఒకసారి తిను చూడు.
English: Eat and see once.
11. खाते ही जाओ।
Telugu: తిన్న వెంటనే వెళ్ళు.
English: Go immediately after eating.
12. खाने के बाद जाओ।
Telugu: తిన్న తర్వాత వెళ్ళు.
English: Go after eating.
13. खाते हुए जाओ।
Telugu: తింటూ వెళ్ళు.
English: Go while eating.
14. खाते-खाते जाओ।
Telugu: తింటూ తింటూ వెళ్ళు.
English: Go while continuously eating.
15. खाने पर भी मत जाओ।
Telugu: తిన్నా కూడా వెళ్లొద్దు.
English: Don't go even if you ate.
16. खाने तक हिलो मत।
Telugu: తినేవరకు కదలొద్దు.
English: Don't move until you eat.
17. क्या मैं खाऊँ?
Telugu: తిననా? (నేను తిననా?)
English: Shall I eat?
18. क्या हम खाएं?
Telugu: తిందామా? (మనం తిందామా?)
English: Shall we eat?
19. हां, हम खाएंगे।
Telugu: అలాగే తిందాం.
English: Yes, let's eat.
20. खाते समय टीवी देखो।
Telugu: తినే సమయంలో టీవీ చూడు.
English: Watch TV while eating.
21. खाने से पहले हाथ धो लो।
Telugu: తినడానికి ముందు చేతులు కడుక్కో.
English: Wash hands before eating.
22. उसे खाने के लिए बोलो।
Telugu: అతనికి తినమని చెప్పు.
English: Tell him to eat.
23. नॉनवेज खाने के बजाय वेज खाओ।
Telugu: నాన్ వెజ్ తినడానికి బదులు వెజ్ తిను.
English: Eat veg instead of eating non-veg.
24. मुझे मांसाहार खाने की आदत है।
Telugu: నాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉంది.
English: I have the habit of eating non-veg.
25. मुझे मांसाहार खाने की आदत थी।
Telugu: నాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉండేది.
English: I used to have the habit of eating non-veg.
26. क्या तुम्हें मांसाहार खाने की आदत है?
Telugu: నీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందా?
English: Do you have the habit of eating non-veg?
27. खाए बिना मत जाओ।
Telugu: తినకుండా వెళ్ళొద్దు.
English: Don't go without eating.
28. खाने के अलावा वह और कुछ नहीं करता।
Telugu: తినడం తప్ప అతను ఏమి చేయడు?
English: He does nothing but eat.
29. अब खाने की जरूरत नहीं है।
Telugu: ఇప్పుడు తినాల్సిన అవసరం లేదు.
English: There is no need to eat now.
30. कल खाने की जरूरत थी।
Telugu: నిన్న తినాల్సిన అవసరం ఉండింది.
English: There was a need to eat yesterday.
31. कल खाने की जरूरत होगी।
Telugu: రేపు తినాల్సిన అవసరం ఉంటుంది.
English: There will be a need to eat tomorrow.
32. तुम्हें खाना नहीं आता।
Telugu: నీకు తినడం రాదు.
English: You don't know how to eat.
33. क्या उसे खाना आता है?
Telugu: అతనికి తినడం వచ్చా?
English: Does he know how to eat?
34. खाते रहो।
Telugu: తింటూ ఉండు.
English: Keep eating.
35. खाते रहिए।
Telugu: తింటూ ఉండండి.
English: Please keep eating.
36. मैं हर दिन खाता हूँ / खाती हूँ।
Telugu: నేను ప్రతి రోజు తింటాను.
English: I eat every day.
37. तुम हर दिन खाते हो / खाती हो।
Telugu: నువ్వు ప్రతిరోజు తింటావు.
English: You eat every day.
38. वह हर दिन खाता है।
Telugu: అతను ప్రతిరోజు తింటాడు.
English: He eats every day.
39. वह हर दिन खाती है।
Telugu: ఆమె ప్రతిరోజు తింటుంది.
English: She eats every day.
40. वे हर दिन खाते हैं।
Telugu: వాళ్లు ప్రతి రోజు తింటారు.
English: They eat every day.
41. हम हर दिन खाते हैं।
Telugu: మేం ప్రతిరోజు తింటాము.
English: We eat every day.
42. वह नहीं खाती।
Telugu: ఆమె తినదు.
English: She doesn't eat.
43. मैं खाता था।
Telugu: నేను తినే వాడిని.
English: I used to eat.
44. तुम खाते थे।
Telugu: నువ్వు తినేవాడివి.
English: You used to eat.
45. वह खाता था।
Telugu: అతను తినేవాడు.
English: He used to eat.
46. वह खाती थी।
Telugu: ఆమె తినేది.
English: She used to eat.
47. वे खाते थे।
Telugu: వాళ్ళు తినేవారు.
English: They used to eat.
48. हम खाते थे।
Telugu: మేము తినే వాళ్ళము.
English: We used to eat.
49. हम नहीं खाते थे।
Telugu: మేము తినే వాళ్ళం కాదు.
English: We didn't use to eat.
50. क्या आप खाते थे?
Telugu: మీరు తినేవారా?
English: Did you use to eat?
51. मैं खा रहा हूँ / खा रही हूँ।
Telugu: నేను తింటున్నాను.
English: I am eating.
52. तुम खा रहे हो / खा रही हो।
Telugu: నువ్వు తింటున్నావ్.
English: You are eating.
53. वह खा रहा है।
Telugu: అతను తింటూ ఉన్నాడు.
English: He is eating.
54. वह खा रही है।
Telugu: ఆమె తింటూ ఉంది.
English: She is eating.
55. वे खा रहे हैं।
Telugu: వాళ్ళు తింటూ ఉన్నారు.
English: They are eating.
56. हम खा रहे हैं।
Telugu: మేము తింటూ ఉన్నాం.
English: We are eating.
57. मैं सुबह से खा रहा हूँ / खा रही हूँ।
Telugu: నేను ఉదయం నుంచి తింటూ ఉన్నాను.
English: I have been eating since morning.
58. वे दोपहर से खा रहे हैं।
Telugu: వాళ్ళు మధ్యాహ్నం నుండి తింటూ ఉన్నారు.
English: They have been eating since afternoon.
59. मैं कल खा रहा था / खा रही थी।
Telugu: నేను నిన్న తింటూ ఉన్నాను.
English: I was eating yesterday.
60. तुम कल 2:00 बजे से 4:00 बजे तक खा रहे थे।
Telugu: నువ్వు నిన్న రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు తింటూ ఉన్నావు.
English: You were eating yesterday from 2:00 to 4:00.
61. वह कल खा रहा होगा।
Telugu: అతను రేపు తింటూ ఉంటాడు.
English: He will be eating tomorrow.
62. वह कल खा रही होगी।
Telugu: ఆమె రేపు తింటూ ఉంటుంది.
English: She will be eating tomorrow.
63. वे कल खा रहे होंगे।
Telugu: వాళ్ళు రేపు తింటూ ఉంటారు.
English: They will be eating tomorrow.
64. मैं कल खाऊँगा / खाऊँगी।
Telugu: నేను రేపు తింటాను.
English: I will eat tomorrow.
65. तुम कल खाओगे।
Telugu: నువ్వు రేపు తింటావు.
English: You will eat tomorrow.
66. वह कल खाएगा।
Telugu: అతను రేపు తింటాడు.
English: He will eat tomorrow.
67. वह कल खाएगी।
Telugu: ఆమె రేపు తింటుంది.
English: She will eat tomorrow.
68. वे कल खाएंगे।
Telugu: వాళ్ళ రేపు తింటారు.
English: They will eat tomorrow.
69. हम कल खाएंगे।
Telugu: మేము రేపు తింటాము.
English: We will eat tomorrow.
70. क्या तुम कल खाओगे?
Telugu: నువ్వు రేపు తింటావా?
English: Will you eat tomorrow?
71. क्या वह कल नहीं खाएगा?
Telugu: అతను రేపు తినడా?
English: Won't he eat tomorrow?
72. मैंने कल खाया।
Telugu: నేను నిన్న తిన్నాను.
English: I ate yesterday.
73. तुमने कल खाया।
Telugu: నువ్వు నిన్న తిన్నావు.
English: You ate yesterday.
74. उसने कल खाया।
Telugu: అతను నిన్న తిన్నాడు.
English: He ate yesterday.
75. उसने कल खाया।
Telugu: ఆమె నిన్న తిన్నది.
English: She ate yesterday.
76. उन्होंने कल खाया।
Telugu: వాళ్లు నిన్న తిన్నారు.
English: They ate yesterday.
77. हमने कल खाया।
Telugu: మేము నిన్న తిన్నాము.
English: We ate yesterday.
78. मैंने अभी खाया है।
Telugu: నేను ఇప్పుడే తిన్నాను.
English: I have just eaten.
79. तुमने इसी हफ्ते में खाया है।
Telugu: నువ్వు ఈ వారంలోనే తిన్నావు.
English: You have eaten in this week only.
80. उसने इसी महीने में खाया है।
Telugu: అతడు ఈ నెలలోనే తిన్నాడు.
English: He has eaten in this month only.
81. तुम अभी तक तीन बार खा चुके हो।
Telugu: నువ్వు ఇప్పటికే మూడుసార్లు తిన్నావు.
English: You have already eaten three times.
82. क्या उसने अभी खाया है?
Telugu: ఆమె ఇప్పుడే తిన్నదా?
English: Has she eaten just now?
83. क्या उन्होंने अभी खाया है?
Telugu: వాళ్ళు ఇప్పుడే తిన్నారా?
English: Have they eaten just now?
84. मैंने तुमसे पहले ही खा लिया था।
Telugu: నేను నీ కంటే ముందే తినేశాను.
English: I had eaten even before you.
85. तुमने मुझसे पहले ही खा लिया था।
Telugu: నువ్వు నాకంటే ముందే తినేసావు.
English: You had eaten before me.
86. उन्होंने सुबह ही खा लिया था।
Telugu: వాళ్ళు ఉదయాన్నే తినేసారు.
English: They had eaten in the morning itself.
87. उन्होंने तुम्हारे आने से पहले ही खा लिया था।
Telugu: వాళ్లు నువ్వు రాకముందే తినేశారు.
English: They had eaten before you arrived.
88. शायद तुम खाते होगे।
Telugu: బహుశా నువ్వు తింటుంటావు.
English: Perhaps you eat.
89. शायद वे खाते होंगे।
Telugu: బహుశా వాళ్ళు తింటుంటారు.
English: Perhaps they eat.
90. शायद वह हर दिन खाता होगा।
Telugu: బహుశా అతను ప్రతిరోజు తింటుంటాడు.
English: Perhaps he eats every day.
91. शायद वह हर रविवार खाती होगी।
Telugu: బహుశా ఆమె ప్రతి ఆదివారం తింటుంటుంది.
English: Perhaps she eats every Sunday.
92. शायद तुम खा रहे होगे।
Telugu: బహుశా నువ్వు తింటూ ఉంటావు.
English: Perhaps you are eating.
93. शायद वह खा रहा होगा।
Telugu: బహుశా అతను తింటూ ఉంటాడు.
English: Perhaps he is eating.
94. शायद वे खा रहे होंगे।
Telugu: బహుశా వాళ్ళు తింటూ ఉంటారు.
English: Perhaps they are eating.
95. शायद कल हम खाएंगे।
Telugu: బహుశా రేపు మేము తింటాం.
English: Perhaps we will eat tomorrow.
96. शायद कल वे खाएंगे।
Telugu: బహుశా రేపు వాళ్ళు తింటారు.
English: Perhaps they will eat tomorrow.
97. शायद वे अगले रविवार खाएंगे।
Telugu: బహుశా వచ్చే ఆదివారం వాళ్ళు తింటారు.
English: Perhaps they will eat next Sunday.
98. शायद राम ने खाया होगा।
Telugu: బహుశా రామ్ తిని ఉంటాడు.
English: Perhaps Ram has eaten.
99. शायद सीता ने नॉनवेज खाया होगा।
Telugu: బహుశా సీత నాన్ వెజ్ తిని ఉంటుంది.
English: Perhaps Sita has eaten non-veg.
100. अगर तुम खाओगे तो हम बाहर जाएंगे।
Telugu: నువ్వు తింటే మనం బయటికి వెళ్దాం.
English: If you eat, we will go out.
101. अगर तुमने खाया होता तो हम बाहर गए होते।
Telugu: నువ్వు తిని ఉంటే మనం బయటకు వెళ్లి ఉండేవాళ్ళం.
English: If you had eaten, we would have gone out.
102. मैं खा सकता हूँ / सकती हूँ।
Telugu: నేను తినగలను.
English: I can eat.
103. तुम खा सकते हो / सकती हो।
Telugu: నువ్వు తినగలవు.
English: You can eat.
104. वह खा सकता है।
Telugu: అతను తినగలడు.
English: He can eat.
105. वह खा सकती है।
Telugu: ఆమె తినగలదు.
English: She can eat.
106. वे खा सकते हैं।
Telugu: వాళ్ళు తినగలరు.
English: They can eat.
107. क्या मैं खा सकता हूँ / सकती हूँ?
Telugu: నేను తినొచ్చా?
English: Can I eat?
108. तुम खा सकते हो।
Telugu: నువ్వు తినొచ్చు.
English: You can eat.
109. वह खा सकता है।
Telugu: అతను తినొచ్చు.
English: He can eat.
110. वह खा सकती है।
Telugu: ఆమె తినొచ్చు.
English: She can eat.
111. शायद वह खा सकता है।
Telugu: బహుశా అతను తినొచ్చు.
English: Perhaps he can eat.
112. मैं कल खा सकूँगा / खा सकूँगी।
Telugu: నేను రేపు తినగలుగుతాను.
English: I will be able to eat tomorrow.
113. तुम खा सकोगे / सकोगी।
Telugu: నువ్వు తినగలుగుతావు.
English: You will be able to eat.
114. वह खा सकेगा।
Telugu: అతను తినగలుగుతాడు.
English: He will be able to eat.
115. वह खा सकेगी।
Telugu: ఆమె తినగలుగుతుంది.
English: She will be able to eat.
116. मैं खा सका / सकी।
Telugu: నేను తినగలిగాను.
English: I could eat. (I was able to eat.)
117. तुम खा सके / सकी।
Telugu: నువ్వు తినగలిగావు.
English: You could eat.
118. वह खा सका।
Telugu: అతను తినగలిగాడు.
English: He could eat.
119. वह खा सकी।
Telugu: ఆమె తినగలిగింది.
English: She could eat.
120. वे खा सके।
Telugu: వాళ్ళు తినగలిగారు.
English: They could eat.
121. मैं अभी खा पा रहा हूँ / रही हूँ।
Telugu: నేను ఇప్పుడు తినగలుగుతూ ఉన్నాను.
English: I am able to eat now.
122. तुम अभी खा पा रहे हो / रही हो।
Telugu: నువ్వు ఇప్పుడు తినగలుగుతున్నావు.
English: You are able to eat now.
123. वह अभी खा पा रहा है।
Telugu: అతను ఇప్పుడు తినగలుగుతూ ఉన్నాడు.
English: He is able to eat now.
124. मैं कल इस समय तक खा पा रहा था / रही थी।
Telugu: నేను నిన్న ఈ సమయానికి తినగలుగుతూ ఉండినాను.
English: I was able to eat at this time yesterday.
125. तुम कल इस समय तक खा पा रहे थे / रही थी।
Telugu: నువ్వు నిన్న ఈ సమయానికి తినగలుగుతున్నావు.
English: You were able to eat at this time yesterday.
126. वे कल इस समय तक खा पा रहे थे।
Telugu: వాళ్లు నిన్న ఈ సమయానికి తినగలుగుతూ ఉండినారు.
English: They were able to eat at this time yesterday.
127. मैं कल इस समय तक खा पा रहा हूँगा / रही हूँगी।
Telugu: నేను రేపు ఈ సమయానికి తినగలుగుతూ ఉంటాను.
English: I will be able to eat by this time tomorrow.
128. तुम कल इस समय तक खा पा रहे होगे / रही होगी।
Telugu: నువ్వు రేపు ఈ సమయానికి తినగలుగుతూ ఉంటావు.
English: You will be able to eat by this time tomorrow.
129. वे कल इस समय तक खा पा रहे होंगे।
Telugu: వాళ్లు రేపు ఈ సమయానికి తినగలుగుతూ ఉంటారు.
English: They will be able to eat by this time tomorrow.
130. मैं खाना चाहता हूँ / चाहती हूँ।
Telugu: నేను తినాలనుకుంటున్నాను.
English: I want to eat.
131. तुम खाना चाहते हो / चाहती हो।
Telugu: నువ్వు తినాలనుకుంటున్నావ్.
English: You want to eat.
132. वह खाना चाहता है।
Telugu: అతను తినాలనుకుంటున్నాడు.
English: He wants to eat.
133. वह खाना चाहती है।
Telugu: ఆమె తినాలనుకుంటుంది.
English: She wants to eat.
134. वे खाना चाहते हैं।
Telugu: వాళ్ళు తినాలనుకుంటున్నారు.
English: They want to eat.
135. हम खाना चाहते हैं।
Telugu: మేము తినాలనుకుంటున్నాం.
English: We want to eat.
136. वह नहीं खाना चाहती है।
Telugu: ఆమె తినాలని అనుకోవట్లేదు.
English: She does not want to eat.
137. क्या तुम खाना चाहते हो?
Telugu: నువ్వు తినాలని అనుకుంటున్నావా?
English: Do you want to eat?
138. मैं खाना चाहता था / चाहती थी।
Telugu: నేను తినాలని అనుకున్నాను.
English: I wanted to eat.
139. तुम खाना चाहते थे / चाहती थी।
Telugu: నువ్వు తినాలని అనుకున్నావ్.
English: You wanted to eat.
140. वह खाना चाहता था।
Telugu: అతను తినాలని అనుకున్నాడు.
English: He wanted to eat.
141. वह खाना चाहती थी।
Telugu: ఆమె తినాలని అనుకుంది.
English: She wanted to eat.
142. शायद तुम खाना चाहते हो / चाहती हो।
Telugu: బహుశా నువ్వు తినాలని అనుకుంటున్నావు.
English: Perhaps you want to eat.
143. शायद वह खाना चाहता है।
Telugu: బహుశా అతను తినాలని అనుకుంటున్నాడు.
English: Perhaps he wants to eat.
144. मुझे हर दिन खाना पड़ता है।
Telugu: నాకు ప్రతిరోజు తినాల్సి వస్తుంది.
English: I have to eat every day.
145. तुम्हें हर दिन खाना पड़ता है।
Telugu: నీకు ప్రతిరోజు తినాల్సి వస్తుంది.
English: You have to eat every day.
146. उन्हें हर दिन खाना पड़ता है।
Telugu: వాళ్లకు ప్రతిరోజు తినాల్సి వస్తుంది.
English: They have to eat every day.
147. क्या उसे हर दिन नॉनवेज खाना पड़ता है?
Telugu: ఆమెకు ప్రతిరోజు నాన్వెజ్ తినాల్సి వస్తుందా?
English: Does she have to eat non-veg every day?
148. तुम्हें कल नॉनवेज खाना पड़ेगा।
Telugu: నీకు రేపు నాన్ వెజ్ తినాల్సి వస్తుంది.
English: You will have to eat non-veg tomorrow.
149. उसे कल नॉनवेज खाना पड़ेगा।
Telugu: అతనికి రేపు నాన్ వెజ్ తినాల్సి వస్తుంది.
English: He will have to eat non-veg tomorrow.
150. मैं कल इस समय तक खा चुका था / खा चुकी थी।
Telugu: నేను నిన్న ఈ సమయానికి తినేసి ఉన్నాను.
English: I had already eaten by this time yesterday.
151. मैं कल इस समय तक खा चुकूंगा / खा चुकूंगी।
Telugu: నేను రేపు ఈ సమయానికి తినేసి ఉంటాను.
English: I will have already eaten by this time tomorrow.
152. मैं अभी खा चुका हूँ / चुकी हूँ।
Telugu: నేను ఇప్పుడే తినేసి ఉన్నాను.
English: I have already eaten just now.
153. मुझे अब खाना है।
Telugu: నేను ఇప్పుడు తినాలి.
English: I have to eat now.
154. तुम्हें अभी खाना है।
Telugu: నువ్వు ఇప్పుడు తినాలి.
English: You have to eat now.
155. उसे खाना है।
Telugu: అతను తినాలి.
English: He has to eat.
156. उसे खाना है।
Telugu: ఆమె తినాలి.
English: She has to eat.
157. उन्हें खाना है।
Telugu: వాళ్లు తినాలి.
English: They have to eat.
158. मुझे अभी नहीं खाना है।
Telugu: నేను ఇప్పుడు తినక్కర్లేదు.
English: I don't have to eat now.
159. तुम्हें अभी नहीं खाना है।
Telugu: నువ్వు ఇప్పుడు తినక్కర్లేదు.
English: You don't have to eat now.
160. मुझे कल खाना था लेकिन मैंने नहीं खाया।
Telugu: నేను నిన్న తినాలి కాని తినలేదు.
English: I was supposed to eat yesterday but I didn't.
161. तुम्हें कल खाना था लेकिन तुमने नहीं खाया।
Telugu: నువ్వు నిన్న తినాలి కాని తినలేదు.
English: You were supposed to eat yesterday but you didn't.
162. उसे कल खाना था लेकिन उसने क्यों नहीं खाया?
Telugu: ఆమె నిన్న తినాలి కానీ ఎందుకు తినలేదు?
English: She was supposed to eat yesterday, but why didn't she?
163. मुझे कल खाना होगा।
Telugu: నేను రేపు తినాలి.
English: I will have to eat tomorrow.
164. तुम्हें कल खाना होगा।
Telugu: నువ్వు రేపు తినాలి.
English: You will have to eat tomorrow.
165. उन्हें कल खाना होगा।
Telugu: వాళ్ళ రేపు తినాలి.
English: They will have to eat tomorrow.
166. मुझे यह हर दिन खाना चाहिए।
Telugu: నేను ఇది ప్రతిరోజు తినాల్సి ఉంది.
English: I should eat this every day.
167. तुम्हें यह हर दिन खाना चाहिए।
Telugu: నువ్వు ఇది ప్రతిరోజు తినాల్సి ఉంది.
English: You should eat this every day.
168. उसे यह हर दिन खाना चाहिए।
Telugu: అతను ఇది ప్రతిరోజు తినాల్సి ఉంది.
English: He should eat this every day.
169. तुम्हें कल खाना चाहिए था।
Telugu: నువ్వు నిన్న తినాల్సింది.
English: You should have eaten yesterday.
170. उसे कल खाना चाहिए था।
Telugu: అతను నిన్న తినాల్సింది.
English: He should have eaten yesterday.
171. उसे कल खाना चाहिए होगा।
Telugu: అతను రేపు తినాల్సి ఉంటుంది.
English: He will have to eat tomorrow.
172. उन्हें कल खाना चाहिए होगा।
Telugu: వాళ్లు రేపు తినాల్సి ఉంటుంది.
English: They will have to eat tomorrow.
173. मैं खाने वाला हूँ।
Telugu: నేను తినబోతున్నాను.
English: I am about to eat.
174. मैं खाने वाला था / खाने वाली थी।
Telugu: నేను తినబోయాను.
English: I was about to eat.
175. तुम खाने वाले हो।
Telugu: నువ్వు తినబోతున్నావు.
English: You are about to eat.
176. तुम खाने वाले थे।
Telugu: నువ్వు తినబోయావు.
English: You were about to eat.
177. वे खाने वाले हैं।
Telugu: వాళ్లు తినబోతున్నారు.
English: They are about to eat.
178. वे खाने वाले थे।
Telugu: వాళ్ళు తినబోయారు.
English: They were about to eat.
179. तुमने क्या खाया?
Telugu: నువ్వు ఏం తిన్నావ్?
English: What did you eat?
180. तुमने कब खाया?
Telugu: నువ్వు ఎప్పుడు తిన్నావ్?
English: When did you eat?
181. तुमने कैसे खाया?
Telugu: నువ్వు ఎలా తిన్నావ్?
English: How did you eat?
182. तुम कैसे खाते हो?
Telugu: నువ్వు ఎలా తింటున్నావ్?
English: How do you eat?
183. तुम कैसे खा रहे हो?
Telugu: నువ్వు ఎలా తింటూ ఉన్నవ్?
English: How are you eating?
184. तुम कब से खा रहे हो?
Telugu: నువ్వు ఎప్పటినుంచి తింటున్నావు?
English: Since when are you eating?
185. तुम क्यों खा रहे हो?
Telugu: నువ్వు ఎందుకు తింటున్నావ్?
English: Why are you eating?
186. तुम किसके साथ खा रहे हो?
Telugu: నువ్వు ఎవరితో తింటున్నావ్?
English: With whom are you eating?
187. कौन खा रहे हैं?
Telugu: ఎవరు తింటున్నారు?
English: Who are eating?
188. कितने लोग खा रहे हैं?
Telugu: ఎంతమంది తింటున్నారు?
English: How many people are eating?
189. कितने खा रहे हो?
Telugu: ఎన్ని తింటున్నావ్?
English: How many are you eating?
190. कहाँ बैठकर खा रहे हो?
Telugu: ఎక్కడ కూర్చుని తింటున్నావ్?
English: Where are you sitting and eating?
191. तुम किसका खाना खा रहे हो?
Telugu: నువ్వు ఎవరి ఫుడ్ తింటున్నావ్?
English: Whose food are you eating?
192. तुम किससे पूछकर खा रहे हो?
Telugu: నువ్వు ఎవరిని అడిగి తింటున్నావ్?
English: Whom did you ask before eating?
193. तुम किसके लिए खा रहे हो?
Telugu: నువ్వు ఎవరి కోసం తింటున్నావ్?
English: For whom are you eating?
194. तुम किस लिए खा रहे हो?
Telugu: నువ్వు దేనికోసం తింటున్నావ్?
English: For what reason are you eating?
195. तुम किसमें खा रहे हो?
Telugu: నువ్వు దేనిలో తింటున్నావ్?
English: In what are you eating?
196. तुम किस पर बैठकर खा रहे हो?
Telugu: నువ్వు దేని పైన కూర్చుని తింటున్నావ్?
English: On what are you sitting and eating?
197. वे बोल रहे हैं कि वे खा रहे हैं।
Telugu: వాళ్లు తింటున్నామని చెప్తున్నారు.
English: They are saying that they are eating.
198. उन्होंने कहा कि उन्होंने खा लिया है।
Telugu: వాళ్లు తిన్నామని చెప్పారు.
English: They said that they have eaten.
199. उन्होंने कहा कि वे खाने वाले हैं।
Telugu: వాళ్లు తినబోతున్నామని చెప్పారు.
English: They said that they are about to eat.
200. उन्होंने कहा कि वे खा सकेंगे।
Telugu: వాళ్ళు తినగలమని చెప్పారు.
English: They said that they would be able to eat.
201. उन्होंने कहा कि वे खाना चाहते हैं।
Telugu: వాళ్లు తినాలనుకుంటున్నాము అని చెప్పారు.
English: They said that they want to eat.
202. उन्होंने मुझसे खाने के लिए कहा।
Telugu: వాళ్లు నన్ను తినమని చెప్పారు.
English: They told me to eat.
203. मैंने सुना है कि आपने खा लिया है।
Telugu: మీరు తిన్నారని విన్నాను / మీరు తినేశారట.
English: I heard that you have eaten.
204. उन्होंने कहा कि उन्हें खाना पड़ता है।
Telugu: వాళ్లకు తినాల్సి వస్తుంది అని చెప్పారు.
English: They said that they have to eat.
205. तो खाओ।
Telugu: అయితే తిను.
English: Then eat.
206. तुम तो खाओ।
Telugu: నువ్వైతే తిను.
English: You at least eat.
207. आज तो खाओ।
Telugu: ఈరోజు అయితే తిను.
English: Eat at least today.
208. यह तो खाओ।
Telugu: ఇదైతే తిను.
English: Eat at least this.
209. यह भी खाओ।
Telugu: ఇది కూడా తిను.
English: Eat this also.
210. तुम भी खाओ।
Telugu: నువ్వు కూడా తిను.
English: You also eat.
211. कल भी खाओ।
Telugu: రేపు కూడా తిను.
English: Eat tomorrow also.
212. काश मैं खाता।
Telugu: నేను తింటే బాగుండు.
English: I wish I had eaten.
213. काश मैं खा सकता।
Telugu: నేను తినగలిగితే బాగుండు.
English: I wish I could eat.
214. काश मैं कल खाऊँ।
Telugu: నేను రేపు తింటే బాగుండు.
English: I wish I could eat tomorrow.
215. जब तुम खाओगे तब मैं भी खाऊँगा।
Telugu: నువ్వు తిన్నప్పుడు నేను కూడా తింటాను.
English: When you eat, I will also eat.
216. जब तुमने खाया, तब मैंने भी खाया।
Telugu: నువ్వు తిన్నప్పుడు నేను కూడా తిన్నాను.
English: When you ate, I also ate.
217. जब तुम खा रहे थे तब मैं भी खा रहा था।
Telugu: నువ్వు నిన్న తింటూ ఉన్నప్పుడు నేను కూడా తింటూ ఉన్నాను.
English: When you were eating yesterday, I was also eating.
218. तुमने जहाँ खाया था, मैंने भी वहीं खाया।
Telugu: నువ్వు ఎక్కడ తిన్నావో అక్కడే నేను కూడా తిన్నాను.
English: Where you ate, I also ate there.
219. तुम जितना खाते हो मैं भी उतना खाता हूँ।
Telugu: నువ్వు ఎంత తింటావో నేను కూడా అంత తింటాను.
English: As much as you eat, I also eat that much.
220. जितना तुम खाते हो मैं उतना नहीं खा सकता।
Telugu: నువ్వు ఎంత తింటావో నేను అంత తినలేను.
English: I cannot eat as much as you eat.
221. जिसने खा लिया है, वह जाकर होमवर्क कीजिए।
Telugu: ఎవరు తినేసారో వాళ్ళు వెళ్లి హోంవర్క్ చేయండి.
English: Whoever has eaten, go and do your homework.
222. जिसको तुमने खाने के लिए कहा था, वे आए हैं।
Telugu: నువ్వు ఎవరిని తినమన్నావో వాళ్ళు వచ్చారు.
English: Those whom you asked to eat have come.
223. यही खाओ।
Telugu: ఇదే తిను.
English: Eat exactly this.
224. तुम ही खाओ।
Telugu: నువ్వే తిను.
English: You yourself eat.
225. अभी खाओ।
Telugu: ఇప్పుడే తిను.
English: Eat right now.
226. आज ही खाओ।
Telugu: ఈ రోజే తిను.
English: Eat today itself.
227. बाद में खाओ।
Telugu: తర్వాత తిను.
English: Eat later.
228. पहले ही खाओ।
Telugu: ముందే తిను.
English: Eat beforehand.
229. सिर्फ यही खाओ।
Telugu: కేవలం ఇదే తిను.
English: Eat only this.
230. धीरे खाओ।
Telugu: నెమ్మదిగా తిను.
English: Eat slowly.
231. जल्दी खाओ।
Telugu: తొందరగా తిను.
English: Eat quickly.
232. ठीक से खाओ।
Telugu: సరిగా తిను.
English: Eat properly.
233. नियमित रूप से खाओ।
Telugu: క్రమం తప్పకుండా తిను.
English: Eat regularly.
234. सुचारु रूप से खाओ।
Telugu: సజావుగా తిను.
English: Eat smoothly.
235. कभी-कभी खाओ।
Telugu: అప్పుడప్పుడు తిను.
English: Eat occasionally.
236. शायद ही कभी खाओ।
Telugu: అరుదుగా తిను.
English: Eat rarely.
237. आज रात को खाओ।
Telugu: ఈరోజు రాత్రికి తిను.
English: Eat tonight.
238. आमतौर पर यही खाओ।
Telugu: సాధారణంగా ఇదే తిను.
English: Usually eat this.
239. हफ्ते में एक बार खाओ।
Telugu: వారానికి ఒకసారి తిను.
English: Eat once a week.
240. साल में एक बार खाओ।
Telugu: సంవత్సరానికి ఒకసారి తిను.
English: Eat once a year.
241. आखिरकार यही खाओ।
Telugu: చివరికి ఇదే తిను.
English: Ultimately eat this.
242. बार-बार खाओ।
Telugu: పదే పదే తిను.
English: Eat again and again.
243. हर घंटे खाओ।
Telugu: ప్రతిగంట తిను.
English: Eat every hour.
244. देर से खाओ।
Telugu: ఆలస్యంగా తిను.
English: Eat late.
245. हर महीने खाओ।
Telugu: ప్రతినెల తిను.
English: Eat every month.
246. कभी मत खाओ।
Telugu: ఎప్పుడూ తినొద్దు.
English: Never eat.
247. कभी ना कभी खाओ।
Telugu: ఎప్పుడో ఒకప్పుడు తిను.
English: Eat sometime.
248. दो बार खाओ।
Telugu: రెండుసార్లు తిను.
English: Eat twice.
249. हमेशा खाते रहो।
Telugu: ఎప్పుడూ తింటూ ఉండు.
English: Always keep eating.
250. उसने अभी तक नहीं खाया है।
Telugu: అతను ఇప్పటివరకు తినలేదు.
English: He has not eaten until now.
251. कितनी बार खाना है?
Telugu: ఎన్నిసార్లు తినాలి?
English: How many times to eat?
252. शाम को खाओ।
Telugu: సాయంత్రం తిను.
English: Eat in the evening.
253. दोपहर को खाओ।
Telugu: మధ్యాహ్నం తిను.
English: Eat in the afternoon.
254. रात भर खाते मत रहो।
Telugu: రాత్రంతా తింటూ ఉండకు.
English: Don't keep eating all night.
255. दिनभर खाता रहता है।
Telugu: రోజంతా తింటూ ఉంటాడు.
English: He keeps eating all day.
256. तब खाया था।
Telugu: అప్పుడు తిన్నాడు.
English: He ate then.
257. अक्सर खाते रहो।
Telugu: తరచుగా తింటూ ఉండు.
English: Keep eating often.
258. अच्छे से खाओ।
Telugu: మంచిగా తిను.
English: Eat nicely.
259. इस किताब के हिसाब से खाओ।
Telugu: ఈ పుస్తకంలో చెప్పిన ప్రకారం తిను.
English: Eat according to this book.
260. स्पष्ट रूप से खाओ।
Telugu: స్పష్టంగా తిను.
English: Eat clearly.
261. बिल्कुल खाओ।
Telugu: కచ్చితంగా తిను.
English: Definitely eat.
262. बिल्कुल मत खाओ।
Telugu: అస్సలు తినొద్దు.
English: Don't eat at all.
263. पूरी तरह से खाओ।
Telugu: పూర్తిగా తిను.
English: Eat completely.
264. हिम्मत से खाओ।
Telugu: ధైర్యంగా తిను.
English: Eat bravely.
265. गुस्से से खाओ।
Telugu: కోపంగా తిను.
English: Eat angrily.
266. भयानक रूप से खाओ।
Telugu: ఘోరంగా తిను.
English: Eat terribly.
267. खूबसूरती से खाओ।
Telugu: అందంగా తిను.
English: Eat beautifully.
268. शांति से खाओ।
Telugu: ప్రశాంతంగా తిను.
English: Eat peacefully.
269. ध्यान से खाओ।
Telugu: జాగ్రత్తగా తిను.
English: Eat carefully.
270. लापरवाही से मत खाओ।
Telugu: నిర్లక్ష్యంగా తినొద్దు.
English: Don't eat carelessly.
271. सही तरीके से खाओ।
Telugu: సరైన పద్ధతిలో తిను.
English: Eat in a proper way.
272. मुख्य रूप से हर दिन खाओ।
Telugu: ముఖ్యంగా ప్రతి రోజు తిను.
English: Eat especially every day.
273. उसने जानबूझकर खाया।
Telugu: ఉద్దేశపూర్వకంగానే తిన్నాడు.
English: He ate intentionally.
274. उत्सुकता से मत खाओ।
Telugu: ఆత్రుతగా తినొద్దు.
English: Don't eat anxiously.
275. आसानी से खाओ।
Telugu: సులువుగా తిను.
English: Eat easily.
276. समान रूप से खाओ।
Telugu: సమానంగా తిను.
English: Eat equally.
277. ठीक से खाओ।
Telugu: సరిగ్గా తిను.
English: Eat properly.
278. ईमानदारी से खाओ।
Telugu: నిజాయితీగా తిను.
English: Eat honestly.
279. मूर्खता से मत खाओ।
Telugu: మూర్ఖంగా తినొద్దు.
English: Don't eat foolishly.
280. खुशी से खाओ।
Telugu: సంతోషంగా తిను.
English: Eat happily.
281. लालच से मत खाओ।
Telugu: అత్యాశతో తినవద్దు.
English: Don't eat greedily.
282. जल्दबाजी में मत खाओ।
Telugu: తొందరపాటుతో తినొద్దు.
English: Don't eat in a hurry.
283. उसने उस लड़की के साथ खा लिया।
Telugu: అతను ఆ అమ్మాయితో కలిసి తినేశాడు.
English: He ate with that girl.
284. उचित तरीके से खाओ।
Telugu: తగిన విధంగా తిను.
English: Eat in an appropriate way.
285. कृपया खाओ।
Telugu: దయచేసి తిను.
English: Please eat.
286. चुपचाप खाओ।
Telugu: మౌనంగా తిను.
English: Eat silently.
287. सच में खाओ।
Telugu: నిజంగా తిను.
English: Eat truly.
288. दुख से मत खाओ।
Telugu: బాధతో తినకు.
English: Don't eat with sorrow.
289. सुरक्षित रूप से खाओ।
Telugu: సురక్షితంగా తిను.
English: Eat safely.
290. स्वार्थ से मत खाओ।
Telugu: స్వార్థంతో తినొద్దు.
English: Don't eat selfishly.
291. समझदारी से खाओ।
Telugu: తెలివిగా తిను.
English: Eat wisely.
292. तेजी से मत खाओ।
Telugu: వేగంగా తినొద్దు.
English: Don't eat fast.
293. पर्याप्त चावल नहीं है, इसलिए कम खाओ।
Telugu: సరిపోయినంత అన్నం లేదు, అందువల్ల తక్కువ తిను.
English: There is not enough rice, so eat less.
294. छुपकर खाओ।
Telugu: చాటుగా తిను.
English: Eat secretly.
295. कष्ट से मत खाओ।
Telugu: కష్టంగా తినొద్దు.
English: Don't eat with difficulty.
296. सीधे बैठकर खाओ।
Telugu: తిన్నగా కూర్చుని తిను.
English: Sit straight and eat.
297. बेवकूफी से मत खाओ।
Telugu: తెలివి తక్కువగా తినొద్దు.
English: Don't eat foolishly.
298. यह सब सफलतापूर्वक खाओ।
Telugu: ఇదంతా విజయవంతంగా తిను.
English: Eat all this successfully.
299. दिल से खाओ।
Telugu: మనస్ఫూర్తిగా తిను.
English: Eat wholeheartedly.
300. अत्यधिक मत खाओ।
Telugu: విపరీతంగా తినొద్దు.
English: Don't eat excessively.
301. दूर बैठकर खाओ।
Telugu: దూరంగా కూర్చుని తిను.
English: Sit far and eat.
302. कहीं भी बैठकर खाओ।
Telugu: ఎక్కడైనా కూర్చుని తిను.
English: Sit anywhere and eat.
303. ऊपर बैठकर खाओ।
Telugu: పైన కూర్చుని తిను.
English: Sit up and eat.
304. नीचे बैठकर खाओ।
Telugu: క్రింద కూర్చుని తిను.
English: Sit down and eat.
305. पीछे की तरफ बैठकर खाओ।
Telugu: వెనుక వైపు కూర్చుని తిను.
English: Sit behind and eat.
306. कहीं न कहीं बैठकर खाओ।
Telugu: ఎక్కడో ఒకచోట కూర్చుని తిను.
English: Sit somewhere and eat.
307. कहाँ बैठकर खाना है?
Telugu: ఎక్కడ కూర్చుని తినాలి?
English: Where to sit and eat?
308. यहीं बैठकर खाओ।
Telugu: ఇక్కడే కూర్చుని తిను.
English: Sit right here and eat.
309. पास बैठकर खाओ।
Telugu: దగ్గర కూర్చుని తిను.
English: Sit near and eat.
310. मेरे बगल में बैठकर खाओ।
Telugu: నా పక్కన కూర్చుని తిను.
English: Sit beside me and eat.
311. वहाँ बैठकर खाओ।
Telugu: అక్కడ కూర్చుని తిను.
English: Sit there and eat.
312. बाहर बैठकर खाओ।
Telugu: బయట కూర్చుని తిను.
English: Sit outside and eat.
313. उसने लगभग सब कुछ खा लिया है।
Telugu: సుమారుగా అంతా తినేశాడు.
English: He ate almost everything.
314. तुम्हें निश्चित रूप से पूरा खाना चाहिए।
Telugu: కచ్చితంగా మొత్తం తినాలి నువ్వు.
English: You must definitely eat everything.
315. पर्याप्त खाओ।
Telugu: తగినంత తిను.
English: Eat enough.
316. बहुत खाओ।
Telugu: చాలా తిను.
English: Eat a lot.
317. कम से कम यह तो खाओ।
Telugu: కనీసం ఇదైనా తిను.
English: Eat at least this.
318. थोड़ा खाओ।
Telugu: కొంచెం తిను.
English: Eat a little.
319. कम खाओ।
Telugu: తక్కువ తిను.
English: Eat less.
320. ज्यादा खाओ।
Telugu: ఎక్కువ తిను.
English: Eat more.
321. बहुत सारा खाओ।
Telugu: చాలా తిను.
English: Eat a whole lot.
322. इसके अलावा यह भी खाओ।
Telugu: ఇదే కాకుండా ఇది కూడా తిను.
English: Eat this as well as that.
323. निस्संदेह खाओ।
Telugu: నిస్సందేహంగా తిను.
English: Eat undoubtedly.
324. चुपके से खाओ।
Telugu: రహస్యంగా తిను.
English: Eat secretly.
325. पेट भर कर खाओ।
Telugu: కడుపు నిండా తిను.
English: Eat to your fill.
326. थोड़ा-थोड़ा करके खाओ।
Telugu: కొద్దికొద్దిగా తిను.
English: Eat little by little.
327. एक ही बार में सब मत खाओ।
Telugu: ఒకేసారి అంతా తినొద్దు.
English: Don't eat everything at once.
328. गरमा-गरम खाओ।
Telugu: వేడి వేడిగా తిను.
English: Eat while it's piping hot.
329. ठंडा होने से पहले खाओ।
Telugu: చల్లారకముందే తిను.
English: Eat before it gets cold.
330. बचा हुआ खाना मत खाओ।
Telugu: మిగిలిపోయిన ఫుడ్ తినొద్దు.
English: Don't eat leftover food.
331. बासी खाना मत खाओ।
Telugu: చద్ది అన్నం తినొద్దు.
English: Don't eat stale food.
332. घर का बना खाना खाओ।
Telugu: ఇంట్లో వండిన ఫుడ్ తిను.
English: Eat home-cooked food.
333. बाहर का खाना खाना छोड़ दो।
Telugu: బయటి ఫుడ్ తినడం మానేయ్.
English: Stop eating outside food.
334. मैंने उसे खिलाया।
Telugu: నేను అతనికి తినిపించాను.
English: I fed him.
335. क्या तुमने बच्चों को खिलाया?
Telugu: నువ్వు పిల్లలకు తినిపించావా?
English: Did you feed the children?
336. उसने मुझे खिलाया।
Telugu: ఆమె నాకు తినిపించింది.
English: She fed me.
337. कृपया उन्हें खिलाओ।
Telugu: దయచేసి వాళ్ళకు తినిపించు.
English: Please feed them.
338. उन्हें मत खिलाओ।
Telugu: వాళ్ళకు తినిపించొద్దు.
English: Don't feed them.
339. कल मैं तुम्हें खिलाऊँगा।
Telugu: రేపు నేను నీకు తినిపిస్తాను.
English: I will feed you tomorrow.
340. वह मुझे हमेशा खिलाता है।
Telugu: అతను నాకు ఎప్పుడూ తినిపిస్తాడు.
English: He always feeds me.
341. मुझे नहीं पता कि उसने खाया या नहीं।
Telugu: వాడు తిన్నాడో లేదో నాకు తెలియదు.
English: I don't know whether he ate or not.
342. अगर खाने का मन करे तो खाओ।
Telugu: తినాలని అనిపిస్తే తిను.
English: Eat if you feel like eating.
343. मैं बिना कुछ खाए ही आ गया।
Telugu: నేను ఏమీ తినకుండానే వచ్చాను.
English: I came without eating anything.
344. वह खाए बिना नहीं रह सकता।
Telugu: అతను తినకుండా ఉండలేడు.
English: He cannot stay without eating.
345. वे खाए बिना नहीं रह सकते।
Telugu: వాళ్ళు తినకుండా ఉండలేరు.
English: They cannot stay without eating.
346. मुझे खाए हुए बहुत दिन हो गए हैं।
Telugu: నేను తిని చాలా రోజులైంది.
English: It has been many days since I ate.
347. तुम्हें नॉनवेज खाए हुए कितने दिन हो गए हैं?
Telugu: నువ్వు నాన్ వెజ్ తిని ఎన్ని రోజులైంది?
English: How many days has it been since you ate non-veg?
348. मैंने बहुत दिनों से नहीं खाया है।
Telugu: నేను తినక చాలా రోజులైంది.
English: I haven't eaten for many days.
349. वह खाता ही जा रहा है।
Telugu: అతను తింటూనే ఉన్నాడు.
English: He keeps on eating.
350. उसने खाना ही छोड़ दिया है।
Telugu: ఆమె తినడమే మానేసింది.
English: She has completely stopped eating.
351. खाने वाले खाएँगे।
Telugu: తినేవాళ్ళు తింటారు.
English: Those who want to eat, will eat.
352. मैं खुद ही खाऊँगा।
Telugu: నేనే స్వయంగా తింటాను.
English: I will eat it myself.
353. उसने खुद ही खा लिया।
Telugu: అతను తనకు తానే తిన్నాడు.
English: He ate by himself.
354. सबको अपना-अपना खाना है।
Telugu: ఎవరికి వారే తినాలి.
English: Everyone should eat their own.
355. तुमने खाया है ना?
Telugu: నువ్వు తిన్నావు కదా?
English: You ate, didn't you?
356. कल खाओगे ना?
Telugu: రేపు తింటావు కదా?
English: You will eat tomorrow, right?
357. उसने नहीं खाया ना?
Telugu: ఆమె తినలేదు కదా?
English: She didn't eat, did she?
358. कितना भी खा ले, उसकी भूख नहीं मिटती।
Telugu: ఎంత తిన్నా వాడికి ఆకలి తీరదు.
English: No matter how much he eats, his hunger is not satisfied.
359. मुझे पता है कि वह कैसे खाता है।
Telugu: అతను ఎలా తింటాడో నాకు తెలుసు.
English: I know how he eats.
360. मुझे बताओ कि तुमने क्यों नहीं खाया।
Telugu: నువ్వు ఎందుకు తినలేదో నాకు చెప్పు.
English: Tell me why you didn't eat.
361. मुझे पता है कि कब खाना है।
Telugu: ఎప్పుడు తినాలో నాకు తెలుసు.
English: I know when to eat.
362. समझ नहीं आ रहा कि क्या खाऊँ।
Telugu: ఏం తినాలో అర్థం కావడం లేదు.
English: I don't understand what to eat.
363. सोच रहा हूँ कि कहाँ खाऊँ।
Telugu: ఎక్కడ తినాలో ఆలోచిస్తున్నాను.
English: I am thinking about where to eat.
364. सिखाओ कि कैसे खाना है।
Telugu: ఎలా తినాలో నేర్పించు.
English: Teach me how to eat.
365. वह खाने के बाद आएगा।
Telugu: అతను తిన్నాక వస్తాడు.
English: He will come after eating.
366. मैं खाने से पहले पूछूँगा।
Telugu: నేను తినకముందు అడుగుతాను.
English: I will ask before eating.
367. वे खाते ही चले गए।
Telugu: వాళ్ళు తినగానే వెళ్ళిపోయారు.
English: They left as soon as they ate.
368. मुझे खाने का मन नहीं है।
Telugu: నాకు తినాలని లేదు.
English: I don't feel like eating.
369. मैं नहीं खा पा रहा हूँ।
Telugu: నేను తినలేకపోతున్నాను.
English: I am unable to eat.
370. तुम क्यों नहीं खा पा रहे हो?
Telugu: నువ్వు ఎందుకు తినలేకపోతున్నావు?
English: Why are you unable to eat?
371. वह नहीं खा पाई।
Telugu: ఆమె తినలేకపోయింది.
English: She couldn't eat.
372. वह खा सका।
Telugu: అతను తినగలిగాడు.
English: He was able to eat.
373. कृपया मुझे खाने दीजिए।
Telugu: దయచేసి నన్ను తిననివ్వండి.
English: Please let me eat.
374. उन्हें शांति से खाने दो।
Telugu: వాళ్ళను ప్రశాంతంగా తిననివ్వు.
English: Let them eat peacefully.
375. उन्होंने मुझे खाने नहीं दिया।
Telugu: వాళ్ళు నన్ను తిననివ్వలేదు.
English: They didn't let me eat.
376. मैं तुम्हें यहाँ खाने नहीं दूँगा।
Telugu: నేను నిన్ను ఇక్కడ తిననివ్వను.
English: I won't let you eat here.
377. अच्छा खाना खाना सेहत के लिए अच्छा है।
Telugu: మంచి ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది.
English: Eating good food is good for health.
378. ज्यादा खाना अच्छा नहीं है।
Telugu: ఎక్కువ తినడం మంచిది కాదు.
English: Eating too much is not good.
379. मुझे नहीं पता कि क्या खाऊँ।
Telugu: నాకేం తినాలో తెలియదు.
English: I don't know what to eat.
380. सोच रहा हूँ कि किसके साथ खाऊँ।
Telugu: ఎవరితో తినాలో ఆలోచిస్తున్నాను.
English: I am thinking about who to eat with.
381. तुमने उसके साथ क्यों खाया?
Telugu: నువ్వు వాడితో ఎందుకు తిన్నావు?
English: Why did you eat with him?
382. वे मेरे साथ खाना पसंद नहीं करते।
Telugu: వాళ్ళు నాతో తినడానికి ఇష్టపడరు.
English: They don't like to eat with me.
383. मुझे किसी के साथ खाना पसंद नहीं है।
Telugu: నాకు ఎవరితోనూ తినడం ఇష్టం లేదు.
English: I don't like to eat with anyone.
384. मैं जब चाहूँ तब खाता हूँ।
Telugu: నేను ఎప్పుడు పడితే అప్పుడు తింటాను.
English: I eat whenever I want.
385. वह जहाँ चाहे वहाँ खाता है।
Telugu: అతను ఎక్కడ పడితే అక్కడ తింటాడు.
English: He eats wherever he wants.
386. जो मन में आए वो मत खाओ।
Telugu: ఏది పడితే అది తినొద్దు.
English: Don't eat whatever comes to your mind.
387. मैं खाते समय टीवी देखता हूँ।
Telugu: నేను తినేటప్పుడు టీవీ చూస్తాను.
English: I watch TV while eating.
388. खाते समय बात मत करो।
Telugu: నువ్వు తినేటప్పుడు మాట్లాడొద్దు.
English: Don't talk while eating.
389. वह खाते-खाते सो गया।
Telugu: అతను తింటూ తింటూ నిద్రపోయాడు.
English: He fell asleep while eating.
390. मैं खाने से पहले ही यहाँ आ गया।
Telugu: నేను తినకముందే ఇక్కడికి వచ్చాను.
English: I came here even before eating.
391. उसने रोते-रोते खाया।
Telugu: ఆమె ఏడ్చుకుంటూ తిన్నది.
English: She ate while crying.
392. हँसते-हँसते मत खाओ।
Telugu: నవ్వుకుంటూ తినొద్దు.
English: Don't eat while laughing.
393. मैं खड़े होकर खा रहा हूँ।
Telugu: నేను నిలబడి తింటున్నాను.
English: I am eating while standing.
394. खड़े होकर खाना अच्छी आदत नहीं है।
Telugu: నిలబడి తినడం మంచి అలవాటు కాదు.
English: Eating while standing is not a good habit.
395. बैठकर आराम से खाओ।
Telugu: కూర్చుని ప్రశాంతంగా తిను.
English: Sit and eat peacefully.
396. अगर मुझे पका कर दोगे तभी मैं खाऊँगा।
Telugu: నాకు వండి పెడితేనే తింటాను.
English: I will eat only if you cook and serve me.
397. मैंने खाना खाकर पानी पिया।
Telugu: నేను అన్నం తిని నీళ్లు తాగాను.
English: I ate food and drank water.
398. वे फल खाकर जी रहे हैं।
Telugu: వాళ్ళు పండ్లు తిని బ్రతుకుతున్నారు.
English: They are surviving by eating fruits.
399. मैं भूखा नहीं रह सकता।
Telugu: నేను కడుపు మాడ్చుకోలేను.
English: I can't stay hungry.
400. बस, अब मैं और कुछ नहीं खा सकता।
Telugu: ఇక చాలు, నేనేమీ తినలేను.
English: That's enough, I can't eat anymore.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)