చాలా మందికి హిందీలో వివిధ టెన్సెస్ (Tenses) ఎప్పుడు వాడాలో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక్కో వాక్యాన్ని ఏ సందర్భంలో (Context) లేదా ఏ పరిస్థితిలో వాడాలో ఒక ఉదాహరణ ద్వారా ఇక్కడ నేర్చుకుందాం.
ఇందుకోసం "ఆమె శుభ్రం చేస్తుంది" (She cleans) అనే ఒకే వాక్యాన్ని తీసుకుని, దానిని వేర్వేరు సమయాల్లో (Tenses) ఎలా మార్చి మాట్లాడాలో క్రింద వివరించాము.
1. నిత్యకృత్యం (Simple Present - Daily Routine)
సందర్భం: ఒక పని రోజూ లేదా క్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పడానికి దీనిని వాడతాము. ఉదాహరణకు, మా పనిమనిషి ప్రతిరోజూ వస్తుంది, ఆమెకి ఇది దినచర్య.
वह रोज़ साफ़ करती है।
(Vah roz saaf karti hai.)
తెలుగు: ఆమె ప్రతిరోజూ శుభ్రం చేస్తుంది.
English: She cleans everyday.
2. గతంలో అలవాటు (Past Habitual)
సందర్భం: గతంలో ప్రతిరోజూ చేసేవారు, కానీ ఇప్పుడు చేయడం లేదు. ఉదాహరణకు, "మా పాత పనిమనిషి ప్రతిరోజూ ఇల్లు చాలా బాగా క్లీన్ చేసేది (కానీ ఇప్పుడు ఆవిడ పని మానేసింది)."
वह रोज़ साफ़ करती थी।
(Vah roz saaf karti thi.)
తెలుగు: ఆమె (ప్రతిరోజూ) శుభ్రం చేసేది.
English: She used to clean everyday.
3. బహుశా రోజూ చేస్తూ ఉంటుంది (Presumption / Habitual Probability)
సందర్భం: మనకు ఖచ్చితంగా తెలియదు కానీ, "బహుశా ఆమె ప్రతిరోజూ ఉదయమే లేచి శుభ్రం చేస్తుంటుంది" అని ఊహించి చెప్పేటప్పుడు ఇది వాడతాము.
वह रोज़ साफ़ करती होगी।
(Vah roz saaf karti hogi.)
తెలుగు: ఆమె ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటుంది.
English: She must be cleaning everyday.
4. ప్రస్తుతం జరుగుతున్న పని (Present Continuous)
సందర్భం: మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఆమె మీ కళ్ళ ముందు గదిని శుభ్రం చేస్తూ ఉంది. "ఆమె ఏం చేస్తోంది?" అని ఎవరైనా అడిగితే చెప్పే సమాధానం.
वह साफ़ कर रही है।
(Vah saaf kar rahi hai.)
తెలుగు: ఆమె (ఇప్పుడు) శుభ్రం చేస్తూ ఉన్నది.
English: She is cleaning.
5. గతంలో ఒకానొక సమయంలో (Past Continuous)
సందర్భం: నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ సమయంలో ఆమె ఆ పని చేస్తూ ఉన్నది. అప్పటి పరిస్థితులను వివరిస్తున్నప్పుడు ఇది వాడతాము.
वह कल साफ़ कर रही थी।
(Vah kal saaf kar rahi thi.)
తెలుగు: ఆమె నిన్న శుభ్రం చేస్తూ ఉన్నది.
English: She was cleaning yesterday.
6. ప్రస్తుతం జరుగుతూ ఉంటుందని ఊహ (Present Continuous Probability)
సందర్భం: మీరు ఆఫీస్ లో ఉన్నారు, ఇంట్లో పనిమనిషి ఏం చేస్తుంటుంది అని ఎవరైనా అడిగితే... "ఆమె ఇప్పుడు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది" అని ఊహిస్తూ చెప్పడం.
वह अभी साफ़ कर रही होगी।
(Vah abhi saaf kar rahi hogi.)
తెలుగు: ఆమె ఇప్పుడు శుబ్రం చేస్తూ ఉంటుంది.
English: She must be cleaning right now.
7. భవిష్యత్తులో జరగబోయేది (Simple Future)
సందర్భం: ఈరోజు ఆమె రాలేదు, రేపు వచ్చి ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది అని హామీ ఇస్తూ చెప్పే సందర్భం.
वह कल साफ करेगी।
(Vah kal saaf karegi.)
తెలుగు: ఆమె రేపు శుభ్రం చేస్తుంది.
English: She will clean tomorrow.
(గమనిక: ఒకవేళ నేను శుభ్రం చేస్తాను అని చెప్పాలంటే "मैं कल साफ करूँगी" - Main kal saaf karungi అని వాడాలి)
8. గతం (Simple Past)
సందర్భం: నిన్న జరిగిన విషయం గురించి ఎవరైనా అడిగినప్పుడు. ఉదాహరణకు: "నిన్న ఇల్లు ఎవరు క్లీన్ చేశారు?" - "ఆమె నిన్న శుభ్రం చేసింది."
उसने कल साफ़ किया।
(Usne kal saaf kiya.)
తెలుగు: ఆమె నిన్న శుభ్రం చేసింది.
English: She cleaned yesterday.
9. ఇప్పుడే పూర్తయిన పని (Present Perfect)
సందర్భం: మీరు ఇప్పుడే ఇంటికి వచ్చారు. ఇల్లు తడిగా ఉంది. అప్పుడు ఆమె ఇప్పుడే శుభ్రం చేసి వెళ్ళింది అని చెప్పడానికి వాడతాము.
उसने अभी साफ़ किया है।
(Usne abhi saaf kiya hai.)
తెలుగు: ఆమె ఇప్పుడే శుభ్రం చేసింది.
English: She has just cleaned.
10. ఎప్పుడో పూర్తయిన పని (Past Perfect)
సందర్భం: మీరు మధ్యాహ్నం నిద్ర లేచేసరికి, ఆమె అప్పటికే ఉదయమే శుభ్రం చేసి వెళ్ళిపోయింది. ఒక గత సమయం కంటే ముందే పని జరిగిపోతే ఇది వాడతాము.
उसने सुबह ही साफ़ किया था।
(Usne subah hi saaf kiya tha.)
తెలుగు: ఆమె ఉదయమే శుభ్రం చేసేసింది (చేసి ఉండింది).
English: She had already cleaned in the morning.
11. జరిగిపోయి ఉంటుందని ఊహ (Past Probability / Future Perfect)
సందర్భం: మీరు ఆఫీస్ లో ఉన్నారు. మీ పనిమనిషి ఉదయం 10 గంటలకే వస్తుంది. ఇప్పుడు సమయం 12 అయ్యింది. కాబట్టి "ఆమె ఈపాటికి శుభ్రం చేసి ఉంటుంది" అని అనుకున్నప్పుడు ఈ వాక్యం వాడతాము.
उसने साफ़ किया होगा।
(Usne saaf kiya hoga.)
తెలుగు: ఆమె (ఈపాటికి) శుభ్రం చేసి ఉంటుంది.
English: She must have cleaned.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)