Back

హిందీలో దినచర్య (Health & Fitness) - Part 5

ఈ చివరి భాగంలో మన విద్యార్థులు రాసిన అద్భుతమైన దినచర్య వాక్యాలు ఉన్నాయి. రోజూ జిమ్ కి వెళ్లడం, యోగా చేయడం, హెల్తీగా జ్యూస్ తాగడం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను మరియు మన VRR Tutorials స్పోకెన్ హిందీ క్లాసుల గురించి వాళ్ళు రాసిన ఫీడ్‌బ్యాక్ వాక్యాలను హిందీలో ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేద్దాం.

ఫిట్‌నెస్ దినచర్య (Fitness & Kids Routine):

1. मैं सुबह पाँच बजे उठती हूँ।

Telugu: నేను ఉదయం 5 గంటలకు లేస్తాను.

English: I wake up at 5 AM in the morning.

2. मैं सुबह मेरे पति और बच्चों के लिए नाश्ता बनाती हूँ।

Telugu: నేను ఉదయం నా భర్త మరియు పిల్లలకు టిఫిన్ తయారు చేస్తాను.

English: I make breakfast for my husband and kids in the morning.

3. मैं पका हुआ भोजन डिब्बे में रखूँगी।

Telugu: నేను వండిన భోజనాన్ని బాక్స్‌లో పెడతాను.

English: I will keep the cooked food in the box.

4. मैं बच्चों को उठाकर उनको ब्रश और नहवाती हूँ।

Telugu: నేను పిల్లలను నిద్ర లేపి వారికి బ్రష్ ఇంకా స్నానం చేయిస్తాను.

English: I wake up the kids and make them brush and bathe.

5. नहाने के बाद बच्चों को स्कूल के लिए तैयार करती हूँ।

Telugu: స్నానం చేయించిన తర్వాత పిల్లలను స్కూల్‌కి రెడీ చేస్తాను.

English: After the bath, I get the kids ready for school.

6. बच्चों के बाल बाँधकर, जूते पहनाती हूँ।

Telugu: పిల్లలకు జడలు వేసి, షూస్ వేస్తాను.

English: Tying the kids' hair, I put on their shoes.

7. बच्चों को खाना का डिब्बा देकर स्कूल बस में चढ़ाती हूँ।

Telugu: పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి, స్కూల్ బస్ ఎక్కిస్తాను.

English: Giving the lunch box to the kids, I make them board the school bus.

8. स्कूल बस में बच्चों को टाटा बताकर, सीधा जिम जाती हूँ।

Telugu: స్కూల్ బస్‌లో పిల్లలకు బై చెప్పి, నేరుగా జిమ్‌కి వెళ్తాను.

English: Saying bye to the kids in the school bus, I go straight to the gym.

9. जिम में ट्रेडमिल पर आधे घंटे तक चलती हूँ।

Telugu: జిమ్‌లో ట్రెడ్‌మిల్ పైన అరగంట నడుస్తాను.

English: I walk on the treadmill for half an hour in the gym.

10. चलने के बाद थोड़ा समय योगा करती हूँ।

Telugu: నడిచిన తర్వాత కొంచెం సేపు యోగా చేస్తాను.

English: After walking, I do yoga for some time.

11. जिम ख़त्म करके घर लौटती हूँ।

Telugu: జిమ్ అయిపోయాక ఇంటికి తిరిగి వస్తాను.

English: After finishing gym, I return home.

12. मैं कपड़े धोती हूँ।

Telugu: నేను బట్టలు ఉతుకుతాను.

English: I wash clothes.

13. कपड़े धोने के बाद कपड़े सुखाती हूँ।

Telugu: బట్టలు ఉతికిన తర్వాత బట్టలు ఆరబెడతాను.

English: After washing clothes, I dry them.

14. मैं नहाती हूँ।

Telugu: నేను స్నానం చేస్తాను.

English: I take a bath.

15. मैं पूजा के बर्तन साफ़ करने के बाद पूजा करती हूँ।

Telugu: నేను పూజ సామాన్లు శుభ్రం చేసిన తర్వాత పూజ చేస్తాను.

English: After cleaning the pooja utensils, I perform pooja.

16. मैं सब्जियाँ धोने के बाद काटती हूँ।

Telugu: కూరగాయలు కడిగిన తర్వాత కట్ చేస్తాను.

English: After washing vegetables, I chop them.

17. मैं खाना पकाती हूँ।

Telugu: నేను వంట చేస్తాను.

English: I cook food.

18. मैं खाना पकाने के बाद, इसे बच्चों के लिए बॉक्स में लगाती हूँ।

Telugu: నేను వంట అయిన తర్వాత, దీనిని పిల్లల కోసం బాక్స్‌లో పెడతాను.

English: After cooking food, I pack it in boxes for the kids.

19. मैं पानी की बोतल में पानी डालती हूँ।

Telugu: నేను వాటర్ బాటిల్‌లో వాటర్ పడతాను.

English: I pour water into the water bottle.

20. मैं बच्चों को नाश्ता खिलाने के बाद स्कूल में छोड़ती हूँ।

Telugu: పిల్లలకు టిఫిన్ తినిపించిన తర్వాత స్కూల్‌లో దింపి వస్తాను.

English: After feeding breakfast to the kids, I drop them at school.

21. मैं नाश्ता खाती हूँ।

Telugu: నేను టిఫిన్ తింటాను.

English: I eat breakfast.

22. मैं अपने और अपने पति के लिए बॉक्स रखती हूँ।

Telugu: నేను నాకు మరియు నా భర్తకు బాక్స్ పెడతాను.

English: I pack boxes for myself and my husband.

23. मैं सुबह 5 बजे उठती हूँ।

Telugu: నేను ఉదయం 5 గంటలకు లేస్తాను.

English: I wake up at 5 AM in the morning.

24. जागने के बाद भगवान से प्रार्थना करती हूँ।

Telugu: నిద్రలేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటాను.

English: After waking up, I pray to God.

25. मैं दरवाज़ा खोलूँगी।

Telugu: నేను తలుపు తీస్తాను.

English: I will open the door.

26. मैं घर के सामने सफ़ाई करूँगी और पानी छिड़कूँगी।

Telugu: నేను ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్ళు చల్లుతాను.

English: I will clean in front of the house and sprinkle water.

27. मैं रंगोली बनाऊँगी।

Telugu: నేను ముగ్గు వేస్తాను.

English: I will draw a rangoli.

28. मैं ब्रश पर पेस्ट लगाने के बाद ब्रश करती हूँ।

Telugu: బ్రష్ మీద పేస్ట్ వేసుకున్న తర్వాత బ్రష్ చేస్తాను.

English: After putting paste on the brush, I brush my teeth.

29. मैं घर साफ़ करूँगी।

Telugu: నేను ఇల్లు శుభ్రం చేస్తాను.

English: I will clean the house.

30. मैं बर्तन बाहर लाकर धोऊँगी।

Telugu: గిన్నెలు బయట పెట్టి తోముతాను.

English: I will bring the dishes outside and wash them.

31. मैं बच्चों को जगाती हूँ।

Telugu: నేను పిల్లలను నిద్రలేపుతాను.

English: I wake up the kids.

32. कपड़े सर्फ़ में भिगोती हूँ।

Telugu: బట్టలు సర్ఫ్‌లో నానబెడతాను.

English: I soak clothes in surf.

33. मैं बच्चों के लिए दूध मिलाती हूँ।

Telugu: నేను పిల్లలకు పాలు కలుపుతాను.

English: I mix milk for the kids.

34. मैं और मेरे पति ग्रीन टी पीते हैं।

Telugu: నేను మరియు నా భర్త గ్రీన్ టీ తాగుతాము.

English: My husband and I drink green tea.

VRR Tutorials ఫీడ్‌బ్యాక్ & క్లాస్ దినచర్య:

35. सुबह में दस बजे से ग्यारह बजे तक प्रैक्टिस सेशन कक्षा में शामिल होती हूँ।

Telugu: ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ క్లాస్‌కి హాజరవుతాను.

English: From 10 AM to 11 AM, I join the practice session class.

36. वहाँ गायत्री मैडम हमसे पहले दिन के पाठ के बारे में मौखिक रूप से अभ्यास करवाती हैं।

Telugu: అక్కడ గాయత్రి మేడమ్ ముందు రోజు పాఠం గురించి ఓరల్‌గా (మౌఖికంగా) ప్రాక్టీస్ చేయిస్తారు.

English: There, Gayatri Madam makes us orally practice the previous day's lesson.

37. शाम को कपड़े और जूते पहनकर पार्क जाकर थोड़ा समय वॉकिंग करने के बाद घर वापस आती हूँ।

Telugu: సాయంత్రం బట్టలు, మరియు షూస్ వేసుకుని పార్క్‌కి వెళ్లి కొద్ది సమయం వాకింగ్ చేసి తిరిగి ఇంటికి వస్తాను.

English: In the evening, wearing clothes and shoes, I go to the park, walk for some time, and return home.

38. रात आठ बजे से नौ बजे स्पोकेन हिंदी क्लास के लिए तैयार हो जाती हूँ।

Telugu: రాత్రి 8 నుండి 9 గంటల స్పోకెన్ హిందీ క్లాస్ కోసం తయారవుతాను.

English: From 8 PM to 9 PM, I get ready for the spoken Hindi class.

39. रात को VRR Tutorials स्पोकेन हिंदी क्लास में कृष्णा रेड्डी जी बहुत सब्र से पाठ को पढ़ाते हुए हमको हिंदी सिखाते हैं।

Telugu: రాత్రికి VRR Tutorials స్పోకెన్ హిందీ క్లాస్‌లో కృష్ణారెడ్డి గారు చాలా ఓపికగా మాకు పాఠాన్ని బోధిస్తూ, హిందీ నేర్పుతారు.

English: At night, in the VRR Tutorials Spoken Hindi class, Krishna Reddy sir teaches us the lesson with great patience and teaches us Hindi.

40. इसी तरह हमें हिंदी सिखाने के लिए हम सब उनको धन्यवाद देते हैं।

Telugu: ఈ విధంగా మాకు హిందీ నేర్పుతున్నందుకు మేమందరం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

English: We all thank him for teaching us Hindi like this.

హెల్త్ అండ్ మార్నింగ్ హ్యాబిట్స్ (Morning Habits):

41. मैं हर दिन सुबह 6 बजे आँख खोलकर बिस्तर से उठना शुरू करता हूँ / करती हूँ।

Telugu: నేను ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు కళ్ళు తెరిచి పరుపు మీద నుండి లేవడం మొదలుపెడతాను.

English: Every day at 6 AM, I open my eyes and start getting out of bed.

42. नींद से उठते ही, कमरे में रहे भगवान की तस्वीर देखते हुए नमस्कार करता हूँ / करती हूँ।

Telugu: నిద్ర నుండి లేస్తూనే, గదిలో ఉన్న భగవంతుని ఫోటో చూస్తూ నమస్కారం పెట్టుకుంటాను.

English: As soon as I wake up from sleep, looking at God's picture in the room, I pray.

43. नमस्कार करने के बाद बाथरूम जाकर ब्रश करके थोड़ा गुनगुना पानी आधा लीटर तक पीता हूँ / पीती हूँ।

Telugu: నమస్కారం చేసుకున్న తర్వాత బాత్‌రూమ్‌కి వెళ్లి బ్రష్ చేసుకుని కొద్ది కొద్దిగా అర లీటర్ వరకు మంచి నీళ్ళు (గోరువెచ్చని నీళ్లు) తాగుతాను.

English: After praying, going to the bathroom and brushing, I drink up to half a liter of lukewarm water little by little.

44. बाद में योगा मैट लेकर नीचे बिछाकर कुछ योगासन करके नहाता हूँ / नहाती हूँ।

Telugu: తర్వాత యోగా మ్యాట్ తీసుకుని క్రింద పరచుకొని యోగాసనాలు వేసి స్నానం చేస్తాను.

English: Later, taking a yoga mat, laying it down, and doing some yoga postures, I take a bath.

45. सुबह कुछ दिनों में नाश्ता खाने के बजाय केला, बीटरूट, खीरा का जूस बनाकर और थोड़े ड्राई फ्रूट्स खाता हूँ / खाती हूँ।

Telugu: ఉదయం కొన్ని రోజుల్లో టిఫిన్ తినడానికి బదులు క్యారెట్ (లేదా అరటి), బీట్‌రూట్, కీరా జ్యూస్ తయారు చేసుకుని జ్యూస్ మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను.

English: In the morning, on some days, instead of eating breakfast, I make banana, beetroot, cucumber juice and eat some dry fruits.

46. उस दिन जूस, ड्राई फ्रूट्स खाने के अलावा, और कुछ नाश्ता सुबह में नहीं खाता हूँ / खाती हूँ।

Telugu: ఆ రోజు జ్యూస్, డ్రై ఫ్రూట్స్ తినడం తప్ప, ఉదయం ఎలాంటి టిఫిన్ చేయను.

English: On that day, apart from drinking juice and eating dry fruits, I don't eat any breakfast in the morning.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!