Back

హిందీ కథలు: దాహం వేసిన కాకి (प्यासा कौआ)

కథల ద్వారా హిందీ నేర్చుకోవడం చాలా సులభం! ఈ పోస్ట్‌లో ప్రసిద్ధమైన "దాహం వేసిన కాకి" కథ ద్వారా కొత్త హిందీ పదాలను మరియు వాక్యాలను నేర్చుకుందాం. వాయిస్ వినడానికి స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.

एक बार गर्मियों में एक कौवे को बहुत प्यास लगी।

Ek baar garmiyon mein ek kauve ko bahut pyaas lagee.

Telugu: ఒకసారి వేసవి కాలంలో ఒక కాకికి బాగా దాహం వేసింది.

English: Once in summer, a crow felt very thirsty.

उसने पानी के लिए बहुत तलाश की।

Usne paanee ke liye bahut talaash ki.

Telugu: అది నీళ్ల కోసం ఎంతో వెతికింది.

English: It searched a lot for water.

आखिरकार उसे एक बगीचे में एक घड़ा दिखाई दिया।

Aakhirkaar usay ek bageeche mein ek ghadaa dikhaayee diya.

Telugu: చివరికి ఒక తోటలో దానికి ఒక కుండ కనిపించింది.

English: Finally, it saw a pot in a garden.

लेकिन उसमें पानी बहुत नीचे था, कौवे की चोंच पानी तक नहीं पहुँची।

Lekin usmein paanee bahut neeche tha, kauve ki chonch paanee tak nahin pahunchee.

Telugu: కానీ అందులో నీళ్లు చాలా అడుగున ఉన్నాయి, కాకి ముక్కుకు నీరు అందలేదు. (चोंच స్త్రీలింగం కాబట్టి पहुँची అని అనాలి)

English: But the water in it was very low, the crow's beak couldn't reach the water.

तब कौवे को एक उपाय सूझा।

Tab kauve ko ek upaay soojhaa.

Telugu: అప్పుడు కాకికి ఒక ఆలోచన (ఉపాయం) వచ్చింది.

English: Then an idea struck the crow.

उसने आसपास पड़े कंकड़ों को एक-एक करके अपनी चोंच से लाकर घड़े में डाल दिया।

Usne aaspaas pade kankadon ko ek-ek karke apnee chonch se laakar ghade mein daal diya.

Telugu: అది చుట్టుప్రక్కల ఉన్న చిన్న రాళ్ళను (కంకరలను) ఒక్కొక్కటిగా తన ముక్కుతో తెచ్చి ఆ కుండలో వేసింది.

English: It brought the pebbles lying around one by one with its beak and dropped them into the pot.

धीरे-धीरे पानी ऊपर आ गया।

Dheere-dheere paanee oopar aa gaya.

Telugu: మెల్లగా నీళ్లు పైకి వచ్చాయి.

English: Slowly the water came up.

कौआ पेट भर पानी पीकर खुशी से उड़ गया।

Kauaa pet bhar paanee peekar khushee se ud gaya.

Telugu: కాకి కడుపునిండా నీరు తాగి సంతోషంగా ఎగిరిపోయింది.

English: The crow drank water to its fill and flew away happily.

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!