Back

Hindi Correlative Sentences & 'दिखाना' Verb Mastery

హిందీలో సంభాషించేటప్పుడు అత్యంత కీలకమైన సాపేక్ష వాక్యాలు (Correlative Sentences - ఎప్పుడైతే... అప్పుడే, ఎక్కడైతే... అక్కడే, ఎంతైతే... అంతే, ఏదైతే... అదే) మరియు 'दिखाना' (చూపించడం) క్రియను రోజువారీ జీవితం, వ్యాపార సందర్భాలు, వివిధ టెన్సెస్ మరియు మోడల్స్ లో తెలుగు వివరణ, సరైన ఉచ్చారణ (TTS Audio) తో ప్రాక్టీస్ చేయండి.

ముఖ్యాంశాలు (Key Grammar Formulas):

1. సమయం (Time):
जब... तब (ఎప్పుడైతే... అప్పుడు)
जब तक... तब तक (అప్పటివరకు... అప్పటివరకు)
2. స్థలం (Place):
जहाँ... वहीं / वहाँ (ఎక్కడైతే... అక్కడే / అక్కడ)
3. పరిమాణం (Quantity):
जितना... उतना / उतना ही (ఎంతైతే... అంత / అంతే)
4. సర్వనామాలు (Pronouns):
जो... वो / जिसने... वो / जिसकी... वो (ఎవరైతే/ఏదైతే... వారు/అది)

1. కాలవాచక సాపేక్ష వాక్యాలు (Time: जब... तब / जब तक... तब तक)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
1.
నేను ఎప్పుడైతే వాకింగ్ వెళ్లాలనుకుంటానో అప్పుడే వర్షం పడుతుంది.
जब मैं सैर पर जाना चाहती हूँ, तब बारिश होती है।
జబ్ మైం సైర్ పర్ జానా చాహ్ తీ హూం, తబ్ బారిష్ హోతీ హై.
Whenever I want to go for a walk, right then it rains.
2.
నేను నిన్న దారిలో వెళుతూ ఉన్నప్పుడు మీరు హోటల్లో భోం చేస్తూ ఉన్నారు.
जब मैं कल सड़क पर जा रही थी, तब आप होटल में खाना खा रहे थे।
జబ్ మైం కల్ సడక్ పర్ జా రహీ థీ, తబ్ ఆప్ హోటల్ మేం ఖానా ఖా రహే థే.
When I was going on the road yesterday, you were eating in the hotel.
3.
నేను వచ్చేటప్పటికే మీరు వెళ్లిపోయారు.
जब तक मैं आया, तब तक आप चले गए।
జబ్ తక్ మైం ఆయా, తబ్ తక్ ఆప్ చలే గయే.
By the time I came, you had already left.
4.
నేను వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారు.
जब मैं आया, तब आप सो रहे थे।
జబ్ మైం ఆయా, తబ్ ఆప్ సో రహే థే.
When I came, you were sleeping.
5.
మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళు షాప్ క్లోజ్ చేసేస్తారు.
जब तक आप जाएंगे तब तक वे दुकान बंद करेंगे।
జబ్ తక్ ఆప్ జాయేంగే తబ్ తక్ వే దుకాన్ బంద్ కరేంగే.
By the time you go, they will have closed the shop.
6.
నువ్వు హోంవర్క్ చేసే వరకు నేను నిన్ను బయటికి పంపించను.
जब तक तुम होमवर्क नहीं करोगे, तब तक मैं तुम्हें बाहर नहीं जाने दूंगा।
జబ్ తక్ తుమ్ హోమ్ వర్క్ నహీం కరోగే, తబ్ తక్ మైం తుమ్హేం బాహర్ నహీం జానే దూంగా.
Until you do your homework, I will not let you go outside.

2. స్థలవాచక సాపేక్ష వాక్యాలు (Place: जहाँ... वहीं / वहाँ)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
7.
మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి.
आप जहाँ हैं, वहीं रहिये।
ఆప్ జహాం హైం, వహీం రహియే.
Stay right where you are.
8.
పోయినసారి మనం ఎక్కడైతే తిన్నామో, అక్కడే తిను.
पिछली बार हमने जहाँ खाया था, तुम वहीं खाओ।
పిఛ్లీ బార్ హమ్నే జహాం ఖాయా థా, తుమ్ వహీం ఖావో.
Eat right where we ate last time.

3. పరిమాణవాచక సాపేక్ష వాక్యాలు (Quantity: जितना... उतना)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
9.
నువ్వు ఎంత తింటావో అంత తిను.
तुम जितना खा सकते हो उतना खाओ।
తుమ్ జితనా ఖా సక్తే హో ఉతనా ఖావో.
Eat as much as you can eat.
10.
నువ్వు ఎంత సంపాదించగలవో అంతే సంపాదించు.
तुम जितना कमा सकते हो उतना ही कमाओ।
తుమ్ జితనా కమా సక్తే హో ఉతనా హీ కమావో.
Earn only as much as you can earn.
11.
నువ్వు ఎలాన్మస్క్ అంత సంపాదించలేవు?
जितना एलन मस्क कमा सके, तुम उतना कमा नहीं सकते।
జితనా ఎలన్ మస్క్ కమా సకే, తుమ్ ఉతనా కమా నహీం సక్తే.
You cannot earn as much as Elon Musk earns.
12.
నువ్వు తిన్నంత నేను తినలేను.
तुम जितना खा सकते हो, मैं उतना नहीं खा सकता।
తుమ్ జితనా ఖా సక్తే హో, మైం ఉతనా నహీం ఖా సక్తా.
I cannot eat as much as you can eat.

4. సాపేక్ష సర్వనామాలు (Relative Pronouns: जो, जिसने, जिसकी, जिससे...)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
13.
నువ్వు ఏదైతే తిన్నావో అది నేనే వండాను.
तुमने जो खाया, वो मैंने ही पकाया।
తుమ్నే జో ఖాయా, వో మైన్నే హీ పకాయా.
Whatever you ate, I only cooked it.
14.
ఎవరైతే భోంచేసారో వాళ్ళు నిద్రపోండి.
जिसने खाया वो सो जाइए।
జిస్నే ఖాయా వో సో జాయియే.
Whoever has eaten, please go to sleep.
15.
ఈ పుస్తకం ఎవరిదో వాళ్ళే తీసుకెళ్ళండి.
यह किताब जिसकी है, वे आकर ले लीजिए।
యహ్ కితాబ్ జిస్కీ హై, వే ఆకర్ లే లీజియే.
Whoever owns this book, please come and take it.
16.
నేను ఎవరిని అడిగానో వాళ్ళే చెప్పాలి.
मैंने जिससे पूछा, उन्हें बताना चाहिए।
మైన్నే జిస్సే పూఛా, ఉన్హేం బతానా చాహియే.
Whomever I asked, they ought to tell.
17.
నేను ఎవరికైతే అప్పిచ్చానో, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
मैंने जिसको उधार दिया, वे अभी फ़ोन नहीं उठा रहे हैं।
మైన్నే జిస్కో ఉధార్ దియా, వే అభీ ఫోన్ నహీం ఉఠా రహే హైం.
Whomever I gave a loan to, they are not answering the phone right now.
18.
దేన్లో అయితే డెడ్ బాడీ ఉందో దాని పైన నువ్వు కూర్చున్నావు.
जिसमें लाश है, तुम उस पर ही बैठे हो।
జిస్మేం లాష్ హై, తుమ్ ఉస్ పర్ హీ బైఠే హో.
The very thing in which the dead body is, you are sitting right on that.
19.
నువ్వు ఇప్పటి వరకు దేనిపైనైతే కూర్చున్నావో దానిలోనే డెడ్ బాడీ ఉంది.
तुम अभी तक जिसपर बैठे हो, उसमें ही लाश है।
తుమ్ అభీ తక్ జిస్పర్ బైఠే హో, ఉస్మేం హీ లాష్ హై.
The very thing on which you have been sitting till now, right inside it is the dead body.
20.
నేను ఎవరి కోసం అయితే ఇదంతా చేసానో, వాళ్లే వెళ్ళిపోయారు.
मैंने जिसके लिए ये सब किया था, वो मुझे समझे बिना चले गए।
మైన్నే జిస్కే లియే యే సబ్ కియా థా, వో ముఝే సమ్ఝే బినా చలే గయే.
The very person for whom I did all this, they left without understanding me.

5. క్రియావిశేషణ రూపాలు (Participles: दिखाते ही, दिखाने से पहले)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
21.
వాళ్లకు చూపించగానే అలమారాలో పెట్టు.
उन्हें दिखाते ही अलमारी में रखो।
ఉన్హేం దిఖాతే హీ అలమారీ మేం రఖో.
Put it in the cupboard immediately after showing them.
22.
వాళ్ళకి చూపించే ముందు నాకు చూపించు.
उन्हें दिखाने से पहले मुझे दिखाओ।
ఉన్హేం దిఖానే సే పహలే ముఝే దిఖావో.
Show it to me before showing them.

6. 'दिखाना' (చూపించడం) క్రియ - వివిధ కాలాలలో వాక్యాలు (Tenses)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
23.
నేను ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు షాప్ లో చీరలు చూపిస్తాను.
मैं हर दिन सुबह से शाम तक शॉप में साड़ियां दिखाता हूँ।
మైం హర్ దిన్ సుబహ్ సే శామ్ తక్ షాప్ మేం సాడియాం దిఖాతా హూం.
I show sarees in the shop every day from morning to evening.
24.
నువ్వు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులో ఏమి చూపిస్తావు?
तुम हर दिन सुबह से शाम तक शॉप में क्या दिखाते हो?
తుమ్ హర్ దిన్ సుబహ్ సే శామ్ తక్ షాప్ మేం క్యా దిఖాతే హో?
What do you show in the shop every day from morning to evening?
25.
ఆమె ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్ లో చీరలు చూపిస్తూ అమ్ముతుంది.
वह हर दिन सुबह से शाम तक शॉप में साड़ियां दिखाते हुए बेचती है।
వహ్ హర్ దిన్ సుబహ్ సే శామ్ తక్ షాప్ మేం సాడియాం దిఖాతే హుయే బేచ్ తీ హై.
She sells sarees by showing them in the shop every day from morning to evening.
26.
నేను ఇంతకుముందు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు షాపులో చీరలు చూపిస్తూ అమ్మేదానిని.
मैं इसके पहले हर दिन सुबह से शाम तक शॉप में साड़ियां दिखाते हुए बेचती थी।
మైం ఇస్కే పహలే హర్ దిన్ సుబహ్ సే శామ్ తక్ షాప్ మేం సాడియాం దిఖాతే హుయే బేచ్ తీ థీ.
Before this, I used to sell sarees by showing them in the shop every day from morning to evening.
27.
ఆమె ఇంతకుముందు అందరికీ తన నగలు చూపించేది.
वह इसके पहले सभी को अपने गहने दिखाती थी।
వహ్ ఇస్కే పహలే సభీ కో అప్నే గహనే దిఖాతీ థీ.
Previously she used to show her jewelry to everyone.
28.
రేపు నీకు మా ఫ్యాక్టరీ చూపిస్తాను.
मैं तुम्हें अपनी फैक्ट्री दिखाऊंगा।
మైం తుమ్హేం అప్నీ ఫ్యాక్టరీ దిఖావూంగా.
I will show you our factory tomorrow.
29.
మీరు నన్ను ఢిల్లీ తీసుకువెళ్లి ఏమేమి చూపిస్తారు?
आप मुझे दिल्ली ले जाकर क्या क्या दिखाएंगे?
ఆప్ ముఝే దిల్లీ లే జాకర్ క్యా క్యా దిఖాయేంగే?
What all will you take me to Delhi and show?
30.
నేను నిన్ను ఢిల్లీ తీసుకువెళ్లి ఎర్రకోట చూపిస్తాను.
मैं तुम्हें दिल्ली ले जाकर लाल किला दिखाऊंगा।
మైం తుమ్హేం దిల్లీ లే జాకర్ లాల్ కిలా దిఖావూంగా.
I will take you to Delhi and show the Red Fort.
31.
ఆమె నాకు తన నగలు చూపించింది.
उसने मुझे अपने गहने दिखाए।
ఉస్నే ముఝే అప్నే గహనే దిఖాయే.
She showed me her jewelry.
32.
ఆమె నీకు తన నగలు చూపించలేదా?
क्या उसने तुम्हें अपने गहने नहीं दिखाए?
క్యా ఉస్నే తుమ్హేం అప్నే గహనే నహీం దిఖాయే?
Did she not show you her jewelry?
33.
నేను వాళ్ళకి చీరలు చూపిస్తూ ఉన్నాను.
मैं उन्हें साड़ियां दिखा रही हूँ।
మైం ఉన్హేం సాడియాం దిఖా రహీ హూం.
I am showing them sarees.
34.
మేము వాళ్ళకి ఉదయం నుండి మా ఫ్యాక్టరీ చూపిస్తూ ఉన్నాము.
हम उन्हें सुबह से अपनी फैक्ट्री दिखा रहे हैं।
హమ్ ఉన్హేం సుబహ్ సే అప్నీ ఫ్యాక్టరీ దిఖా రహే హైం.
We have been showing them our factory since morning.
35.
మేము నిన్న ఈ సమయానికి వాళ్ళకి మా ఫ్యాక్టరీ చూపిస్తూ ఉన్నాము.
हम कल इस समय उन्हें अपनी फैक्ट्री दिखा रहे थे।
హమ్ కల్ ఇస్ సమయ్ ఉన్హేం అప్నీ ఫ్యాక్టరీ దిఖా రహే థే.
Yesterday at this time, we were showing them our factory.
36.
మేము రేపు వాళ్ళకి ఈ సమయానికి మా ఫ్యాక్టరీ చూపిస్తూ ఉంటాము.
हम कल इस समय उन्हें अपनी फैक्ट्री दिखा रहे होंगे।
హమ్ కల్ ఇస్ సమయ్ ఉన్హేం అప్నీ ఫ్యాక్టరీ దిఖా రహే హోంగే.
Tomorrow at this time, we will be showing them our factory.
37.
నువ్వు నాకు ఈ చీర చూపించి ఉంటే నేను కూడా కొనేదానిని.
अगर तुम मुझे ये साड़ी दिखाते तो मैं खरीदती।
అగర్ తుమ్ ముఝే యే సాడీ దిఖాతే తో మైం ఖరీద్ తీ.
If you had shown me this saree, I too would have bought it.
38.
ఒకవేళ నువ్వు నాకు చీర చూపిస్తే నేను కొంటాను.
अगर तुम मुझे ये साड़ी दिखाओगी, तो मैं खरीदूंगी।
అగర్ తుమ్ ముఝే యే సాడీ దిఖావోగీ, తో మైం ఖరీదూంగీ.
If you show me this saree, I will buy it.

7. సామర్థ్యం, బాధ్యత & అవసరాలు (Modals & Compulsion: सकना, चाहना, पड़ना, चाहिए)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
39.
నేను ఈ చీరలన్నీ చూపించగలను.
मैं सारी साड़ियां दिखा सकता हूँ।
మైం సారీ సాడియాం దిఖా సక్తా హూం.
I can show all these sarees.
40.
నేను చీరలు చూపించ గలిగాను.
मैं साड़ियां दिखा सकी।
మైం సాడియాం దిఖా సకీ.
I could show the sarees / was able to show the sarees.
41.
నేనీ చీరలు చూపించ గలుగుతాను.
मैं साड़ियां दिखा सकूंगा।
మైం సాడియాం దిఖా సకూంగా.
I will be able to show these sarees.
42.
నేను మీకు మా ఇల్లు చూపించాలని అనుకుంటున్నాను.
मैं आपको अपना घर दिखाना चाहता हूँ।
మైం ఆప్కో అప్నా ఘర్ దిఖానా చాహతా హూం.
I want to show you my house.
43.
నేను మీకు మా ఇల్లు చూపించాలని అనుకున్నాను.
मैं आपको अपना घर दिखाना चाहता था।
మైం ఆప్కో అప్నా ఘర్ దిఖానా చాహతా థా.
I wanted to show you my house.
44.
నేను మీకు మా ఇల్లు చూపించాలి.
मुझे आपको अपना घर दिखाना है।
ముఝే ఆప్కో అప్నా ఘర్ దిఖానా హై.
I have to show you my house.
45.
నేను మీకు మా ఇల్లు చూపించాల్సి ఉంటుంది.
मुझे आपको अपना घर दिखाना होगा।
ముఝే ఆప్కో అప్నా ఘర్ దిఖానా హోగా.
I will have to show you my house.
46.
నేను మీకు మా ఇల్లు చూపించాల్సింది.
मुझे आपको अपना घर दिखाना चाहिए था।
ముఝే ఆప్కో అప్నా ఘర్ దిఖానా చాహియే థా.
I should have shown you my house.
47.
నేను వాళ్ళకి ఫ్యాక్టరీ చూపించాల్సి వస్తుంది.
मुझे उन्हें अपनी फैक्ट्री दिखानी पड़ती है।
ముఝే ఉన్హేం అప్నీ ఫ్యాక్టరీ దిఖానీ పడ్తీ హై.
I have to (compulsorily/habitually) show them the factory.

7. సామర్థ్యం, బాధ్యత & అవసరాలు (Modals & Compulsion: सकना, चाहना, पड़నా, चाहिए)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
48.
నీకు చీరలు చూపించాల్సిన అవసరం నాకు లేదు.
तुम्हें साड़ियां दिखाने की जरूरत मुझे नहीं है।
తుమ్హేం సాడియాం దిఖానే కీ జరూరత్ ముఝే నహీం హై.
I don't need to show you the sarees.

8. సంపూర్ణ క్రియలు & ఇన్‌సెప్టివ్ రూపాలు (Perfect Tenses & Aspectual: चुका, लगना)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
49.
ఆవిడ వాళ్లకు చీరలు చూపించాను అని చెప్పింది.
उसने कहा कि उसने उन्हें साड़ियाँ दिखाई थीं।
ఉస్నే కహా కి ఉస్నే ఉన్హేం సాడియాం దిఖాయీ థీం.
She said that she had shown them sarees.
50.
మేము వాళ్ళకి నిన్ననే చీరలు చూపించేశాం.
हम उन्हें कल ही साड़ियां दिखा चुके थे।
హమ్ ఉన్హేం కల్ హీ సాడియాం దిఖా చుకే థే.
We had already shown them the sarees yesterday itself.
51.
మేము వారికి రేపు ఈ సమయానికి వాళ్ళకి చీరలు చూపించేస్తాము.
हम उन्हें कल इस समय तक साड़ियां दिखा चुके होंगे।
హమ్ ఉన్హేం కల్ ఇస్ సమయ్ తక్ సాడియాం దిఖా చుకే హోంగే.
We will have finished showing them sarees by this time tomorrow.
52.
మేము వాళ్ళకి రేపు చీరలు చూపించనారంభిస్తాము.
हम उन्हें कल साड़ियाँ दिखाने लगेंगे।
హమ్ ఉన్హేం కల్ సాడియాం దిఖానే లగేంగే.
We will begin showing them sarees tomorrow.

9. వాస్తవ సంభాషణలు & వ్యాపార సందర్భాలు (Real-world Shopping & Business Contexts)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
53.
నేనెప్పుడైతే చీరలు చూపిస్తానో అప్పుడు అమ్మకాలు ఎక్కువవుతాయి.
जब मैं साड़ियां दिखाती हूँ तब बिक्री ज्यादा होती है।
జబ్ మైం సాడియాం దిఖాతీ హూం తబ్ బిక్రీ జ్యాదా హోతీ హై.
Whenever I show sarees, sales increase.
54.
నేను ఎక్కడైతే చీరలు అమ్ముతున్నానో, అక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి.
मैं जहाँ साड़ियां बेच रही हूँ, वहाँ बहुत सारी दुकानें हैं।
మైం జహాం సాడియాం బేచ్ రహీ హూం, వహాం బహుత్ సారీ దుకానేం హైం.
Where I am selling sarees, there are many shops there.
55.
నేను నువ్వు అమ్మినన్ని చీరలు అమ్మలేను.
तुम जितनी साड़ियां बेच सकती हो, मैं उतनी नहीं बेच सकती।
తుమ్ జితనీ సాడియాం బేచ్ సక్తీ హో, మైం ఉతనీ నహీం బేచ్ సక్తీ.
I cannot sell as many sarees as you can sell.
56.
నువ్వు ఎవరికైతే చీరలు అమ్మవో వాళ్ళందరూ చీరలు తీసుకొచ్చేశారు.
तुमने जिसको साड़ियां बेचीं, वो सब साड़ियां लेकर आ गए।
తుమ్నే జిస్కో సాడియాం బేచీం, వో సబ్ సాడియాం లేకర్ ఆ గయే.
Whomever you sold sarees to, they all brought the sarees back.
57.
నువ్వు దేనిలోనుండి చీరలు చూపించావో వాళ్ళకి అవే కావాలంట.
तुमने जिसमें से साड़ियां दिखाईं, उन्हें वही चाहिए।
తుమ్నే జిస్మేం సే సాడియాం దిఖాయీం, ఉన్హేం వహీ చాహియే.
They want the very ones from whichever lot you showed sarees from.
58.
నువ్వు ఎవరి కోసం అయితే చీరలు తెప్పించావు వాళ్ళు వచ్చారు.
तुम जिसके लिए साड़ियां मंगवाई हो, वे आए हैं।
తుమ్ జిస్కే లియే సాడియాం మంగవాయీ హో, వే ఆయే హైం.
The people for whom you ordered sarees have arrived.

🎯 Spoken Hindi & English Fluency Online Classes

Contact / WhatsApp: 7901339977 | VRR TUTORIALS

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!